Dil Raju: ఎఫ్3 కలెక్షన్ల విషయంలో దిల్ రాజు స్ట్రాటెజీ ఇదే!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఎఫ్3 సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు 45 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. మరో 18 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఈ వీకెండ్ లో ఎఫ్3 సినిమా సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్ల గురించి అవగాహనకు రావచ్చు.

ఎఫ్3 సొంత సినిమా కావడంతో దిల్ రాజు రివర్స్ స్ట్రాటజీలో అడుగులు వేస్తుండటం గమనార్హం. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రస్తుతం ఎఫ్3 సినిమా ఒక థియేటర్ కు మాత్రమే పరిమితమైంది. దిల్ రాజు సొంతంగా ఎఫ్3 సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఏరియాలలో ఎఫ్3 సినిమాకు థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం పెద్దపెద్ద సిటీలలో సైతం ఎఫ్3 ఒకటి రెండు థియేటర్లకు మాత్రమే పరిమితమైంది.

దిల్ రాజు ఈ విధంగా చేయడం వల్ల ఎఫ్3 సినిమాకు షేర్ కలెక్షన్లు పెరుగుతున్నాయి. సొంత సినిమా కాబట్టే దిల్ రాజు ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. అయితే మిగతా నిర్మాతల సినిమాల విషయంలో మాత్రం దిల్ రాజు ఈ స్ట్రాటజీని పాటించడం లేదు. దిల్ రాజు సొంత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

వాస్తవానికి ఎఫ్3 మరీ ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదల కాలేదు. దిల్ రాజు స్ట్రాటజీల వల్ల ఎఫ్3 సినిమా తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తునాయి. నైజాం ఏరియాలో ఈ సినిమా మొదట బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్3 సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. రిలీజైన ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus