తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడకపోయినా.. రిలీజ్ రోజు ఉదయం లేచేసరికే టాక్ వచ్చేస్తుంది. ఓవర్సీస్‌లో అప్పటికే షోలు పడిపోవడంతో అక్కడి వీడియోలు, వ్యూస్, కామెంట్లు, పోస్ట్‌ల ద్వారా టాక్ తెలిసిపోతుంది. దీంతో ఇక్కడ మార్నింగ్ షోల మీద ప్రభావం బాగానే కనిపిస్తుంది. సినిమా బాగుందంటే టికెట్‌లు బ్లాక్‌లోకి వెళ్తాయి. ఒకవేళ సినిమా బాగోలేదు అంటే కలక్షన్లు డీలా పడిపోతాయి. దీంతో ‘ఎఫ్ 3’ విషయంలో దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
వెంకటేశ్, వరుణ్‌తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3’. దిల్ రాజు ఈ సమ్మర్‌కి ఈ సోగ్గాళ్లను తీసుకొస్తున్నారు. ఈ వారం అంటే మే 27న సినిమా విడుదల కాబోతోంది. సాధారణ టికెట్ ధరలకే సినిమా వేస్తున్నాం అని చెప్పినా.. కాస్త ఎక్కువ టికెట్ రేట్లతో సినిమా వేస్తున్నారు. ఈ విషయం పక్కనపెడితే ఓవర్సీస్ ప్రీమియర్‌ల టైమింగ్‌లో మార్పు చేయాలని నిర్ణయించుకున్నారట. అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎప్పుడు పడితే, అప్పుడే ఓవర్సీస్‌లో కూడా సినిమా ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారట.
మామూలుగా 27న ఉదయం మనకు ఏడు గంటలకు సినిమా పడితే… అమెరికాలో ఆ టైమ్‌కి సినిమా షో పడి, జనాలు బయటకు వచ్చేస్తారు కూడా. కాబట్టి ఇక్కడ సినిమా పడే టైమ్ అంటే ఉదయం ఏడు తర్వాతే అక్కడ 26న రాత్రి 9 తర్వాతే షో వేస్తారట. దాని వల్ల అక్కడి టాక్ వచ్చేలోగా ఇక్కడ సినిమా షో పడిపోతుంది. దాని వల్ల అక్కడి టాక్ ఇంపాక్ట్ ఇక్కడ ఉండదు అని అనుకుంటున్నారట. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి.
ఇక ఇందాక చెప్పినట్లు సినిమా సాధారణ టికెట్ ధరలతో అయితే వేయడం లేదు. మల్టీప్లెక్స్‌ల్లో సినిమాకు రూ.295 వసూలు చేస్తున్నారు. సింగిల్ థియేటర్లలో రూ. 175 తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే వీటికి కేరియర్ ఛార్జీలు, సర్వీసుల ఛార్జీలు అంటూ రూ. 30 నుండి రూ. 40 వరకు అధికంగా పడుతుంది.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!