మరోసారి దెబ్బ తినకూడదని జాగ్రత్త పడ్డ దిల్ రాజు

తెలుగు సినిమాలు ఏది విజయం సాధిస్తాయి? ఏది ఫ్లాప్ అవుతాయని.. మొదటి కాపీ చూడగానే చెప్పే వ్యక్తి… ఏ సమయంలో ఎటువంటి సినిమాని రిలీజ్ చేయాలో తెలిసిన జ్ఞాని దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా అనేక ఏళ్ళు అనుభవాన్ని అందుకొని నిర్మాతగా ఎదిగి స్టార్ హీరోలతో సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. ఈ మధ్య అతను ఎంచుకున్న కథల ఫలితాలు తారుమారు అవుతున్నాయి. అలాగే హీరోలపై అంచనా కూడా రివర్స్ అవుతున్నాయి. నితిన్ తో దిల్ రాజు “శ్రీనివాస కళ్యాణం” చిత్రం తీశారు. ఈ సినిమాని తన ప్రచార హోరుతో విజయ తీరాలను దాటించాలని అనుకున్నారు. అంత సవ్యంగా జరుగుతుందని అనుకునే లోపున “గీత గోవిందం” పెద్ద షాక్‌ ఇచ్చింది. ఈ సినిమా రావడంతో అన్ని థియేటర్లలో “శ్రీనివాస కళ్యాణం” తీసేసారు.

విజయ్‌ దేవరకొండని తక్కువ అంచనా వేసినందుకు బాధపడ్డారు. తర్వాత ఆ విషయాన్నీ దిల్‌ రాజు అందరి ముందు ఒప్పుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ కి మాదిరిగానే విజయ్ కి క్రేజ్ ఉందని ఒప్పుకున్నారు. అలాగే విజయ్ కి పోటీగా వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. తాను నిర్మిస్తోన్న “హలో గురూ ప్రేమకోసమే” చిత్రాన్ని అక్టోబర్‌ 18న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అయితే అదే రోజున విజయ్ దేవరకొండ “నోటా”ని కూడా విడుదల చేద్దామని నిర్మాత జ్ఞానవేల్‌ రాజా భావించారు. దీంతో దిల్‌ రాజు రంగంలోకి దిగి “నోటా” అక్టోబర్‌ 5 నే వచ్చేలా చక్రం తిప్పారు. తాను సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. దిల్ రాజు మాత్రమే కాదు స్టార్ హీరోలు సైతం విజయ్ దేవరకొండ సినిమా అంటేనే ఆలోచిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus