ఈ కాంబినేషన్ కోసం కదా జనాలు ఎదురుచూస్తుంది
- April 30, 2019 / 05:41 PM ISTByFilmy Focus
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ సెట్ అవ్వాలి అని అందరూ అనుకుంటారు కానీ.. ఎందుకో అవి సెట్ అవ్వవు. అలాంటి రేర్ కాంబినేషన్స్ లో ఒకటి దిల్ రాజు బ్యానర్ లో బాలయ్య సినిమా. ఇండస్ట్రీలోని దాదాపు అందరు హీరోలతో సినిమాలను ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణలతో మాత్రమే సినిమాలు చేయలేదు. పవన్ కళ్యాణ్ తో ఎలాగూ ఇక సినిమా తీసే ఛాన్స్ లేదు. చిరంజీవితో వీలవ్వకపోవచ్చు కూడా. ఇక మిగిలింది బాలయ్య మాత్రమే. అయితే.. దిల్ రాజు బ్యానర్ లో బాలయ్య సినిమా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఈమధ్యే ఓ కొత్త దర్శకుడు బాలయ్యకు సరిపడా కథను దిల్ రాజుకు వినిపించాడని, ఆ కథ దిల్ రాజుకు నచ్చడమే కాక బాలయ్యకు త్వరలోనే స్టోరీ సిట్టింగ్ కు కూర్చోబెడతానని చెప్పాడట. సో, కుదరాలే కానీ 2019 లేదా 2020లో బాలయ్య సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మరి దిల్ రాజు బ్యానర్ లో బాలయ్య కథానాయకుడుగా తెరకెక్కేది.. యాక్షన్ సినిమానా లేక దిల్ రాజు ఫార్మాట్ ఫ్యామిలీ సినిమానా అనేది తెలియాలి.














