Love Today Movie: ‘లవ్ టుడే’ వాయిదా పడినట్లే!

ఈ నెలలో మొదటి వారంలో విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదు. గతవారంలో విడుదలైన ‘యశోద’ సినిమా పరిస్థితి కూడా ఏమంత బాలేదు. వీకెండ్ వరకు సినిమా బాగానే ఆడింది. ఆ తరువాత డల్ అయిపోయింది. ఇక ఈ వారానికి చెప్పుకోదగ్గ సినిమాలేవీ రావడం లేదు. థియేటర్లు చాలా వరకు ఎవైలబుల్ గా ఉన్నాయి. కానీ సరైన సినిమా మాత్రం రావడం లేదు. ‘మాసూద’ అనే హారర్ మూవీ రాబోతుంది.

ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై కాస్త బజ్ ఏర్పడింది. ఈ వారం సరైన పోటీ లేకపోవడం చూసి తమిళ బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు దిల్ రాజు. ఈ మేరకు పావులు కూడా కదిపారు. కానీ ఆయన అనుకున్నట్లుగా ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యేలా లేదు. నిజానికి మంగళవారం నాడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా జరగాల్సి ఉంది.

కానీ సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఆ కార్యక్రమం ఆపేశారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఉన్న విషాద సమయంలో ‘లవ్ టుడే’ సినిమాను ప్రమోట్ చేయడం బాగోదని.. సినిమా రిలీజ్ విషయంలోనే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో రిలీజ్ అన్నారు. కానీ ఇప్పటివరకు బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. దీన్ని బట్టి సినిమా అనుకున్న సమయానికి రావడం లేదని స్పష్టమవుతోంది. ఈ సినిమా హీరో, హీరోయిన్లు సంగతి మనకి తెలియదు.

డైరెక్టర్ కూడా పరిచయం లేదు. ఈ సినిమా గురించి కూడా జనాలకు పెద్దగా తెలియదు . కాబట్టి ప్రమోషన్స్ గట్టిగా చేసి.. సినిమాను జనాల్లోకి రీచ్ అయ్యేలా చేయాలి. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో అదంతా అయ్యేలా లేదు. అందుకే దిల్ రాజు సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus