సినిమాల గురించి, సినిమాల విజయం గురించి, సినిమాల మీద మీడియా ఇచ్చే రివ్యూల గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. సినిమా పరిశ్రమలో వచ్చే మాటల కంటే.. ఆయన మాటలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తాజాగా ఆయన సినిమా నచ్చిత ఇలా చేయండి.. నచ్చకపోతే అలా చేయండి అంటూ కొత్తగా మాట్లాడారు. దాంతోపాటు సినిమా హిట్ – బ్లాక్‌బస్టర్ లెక్క కూడా చెప్పారు.
సుహాస్ హీరోగా దర్శకుడు సందీప్ బండ్ల తెరకెక్కించిన చిత్రం ‘జనక అయితే గనక’. ఈ పాటికే విడుదలవ్వాల్సిన ఈ సినిమా వివిధ ప్లాన్స్ ప్రకారం వాయిదా వేశారు. తాజాగా దసరా కానుకగా ఈ నెల 12న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ నచ్చితే ‘బలగం’ సినిమాలా ప్రోత్సహించండి.. నచ్చకపోతే విడుదల వరకు సైలెంట్‌గా ఉండండి అని సూచించారు. సినిమా వేసేసి, చూసేసి కామ్‌గా ఉండండి అంటే ఎలా అనే మాట ఆయనకు సమాధానంగా వినిపిస్తుండటం గమనార్హం.
ఇక ఆ విషయం పక్కన పెడితే.. సినిమా ఎలా విజయం సాధిస్తుంది, ఎప్పుడు విజయం సాధిస్తుంది అనే విషయాన్ని కూడా దిల్ రాజు చెప్పారు. ఓ సినిమా వందకు వందమందికి నచ్చితే క్లాసిక్ అవుతుంది. అదే వందలో 70 మందికి నచ్చితే సూపర్‌హిట్ అవుతుంది. కేవలం 50 మందికి నచ్చితే హిట్ అంటారు. ఇదీ సినిమా కాలిక్యులేషన్ అని దిల్ రాజు విశ్లేషించారు.
పెద్ద సినిమాలు విడుదలైన తొలి రోజు చాలామంది హంగామా చేస్తుంటారు. కానీ రెండో రోజు వసూళ్లు చూసి ‘మాకు నచ్చకపోయినా సినిమా హిట్ అయింది అని అంటుంటారు. సినిమా విషయంలో అభిప్రాయాలు అలా మారుతూ ఉంటాయి అని దిల్ రాజు విశ్లేషించారు. ఇక తమ సినిమా ‘జనక అయితే గనక’ వందలో 70 మందికి నచ్చుతుందని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.