Ajith,Vijay: ‘నేను అందగాడిని’, తమిళ్ ఆడియన్స్ కి కూడా టార్గెట్ అయిన దిల్ రాజు, ట్రోలింగ్ షురూ..!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. చాలా కూల్ పర్సన్. కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతూ ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఆయన రెండు రకాలుగా మాట్లాడటం వల్ల బ్యాడ్ అయిపోతున్నారు. ఆయన నిర్మాతగా ఉంటే ఒక లెక్క… డిస్ట్రిబ్యూటర్ గా ఉంటే ఇంకో లెక్క… అన్నట్టు ఉంటుంది ఆయన మాట తీరు. ఇక అసలు విషయానికి వస్తే.. చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ వంటి పెద్ద సినిమాలు 2023 సంక్రాంతికి రిలీజ్ అవుతుంటే, ఆ రెండిటినీ కాదని తాను నిర్మిస్తున్న తమిళ సినిమా ‘వరిసు'(వారసుడు) కి ఎక్కువ థియేటర్లు హోల్డ్ చేసుకున్నాడు దిల్ రాజు.

దీంతో అతని పై వ్యతిరేకత నెలకొంది. 2019 లో రజనీకాంత్ సినిమా ‘పేట’ ని కాదని తన సినిమా ‘ఎఫ్3’ కి ఎక్కువ థియేటర్లు కేటాయించుకున్నాడు దిల్ రాజు. అప్పుడు ‘డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతి సీజన్లో ఎక్కువ థియేటర్లు ఇవ్వడం కుదరదు’ అని అతనే అన్నాడు. కానీ ఇప్పుడు తన సినిమాకి వచ్చేసరికి ఇంకో మాట అంటున్నాడు.సరే అది ఇక్కడి వరకే ఉంటే బాగుండేది. కానీ తమిళ ఆడియన్స్ ను కూడా ఇతను కెలికేశాడు.

అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో అంటూ దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేసి ట్రోలింగ్ కు గురవుతున్నాడు. దిల్ రాజు మాట్లాడుతూ.. “తమిళనాడులో నా సినిమా(వరిసు.. తెలుగులో వారసుడు)తో పాటు అజిత్ గారి సినిమా(తునివు) కూడా రిలీజ్ అవుతుంది. తమిళనాడులో నెంబర్ 1 స్టార్ హీరో విజయ్ గారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అక్కడ(తమిళనాడులో) 800 థియేటర్లు(స్క్రీన్స్) ఉన్నాయి. నేను అక్కడికి వెళ్లి అడుక్కుంటున్నాను. వాళ్ళు 400 థియేటర్లు- 400 థియేటర్లు సగం సగం అంటుంటే..

కాదయ్యా బాబు మాకు కనీసం 50 థియేటర్లు ఎక్కువ ఇవ్వండి అని అడుక్కుంటున్నాను. నిజానికి ఇది వ్యాపారం. తమిళ్ లో నాది పెద్ద సినిమా. అజిత్ గారి కంటే విజయ్ గారు పెద్ద స్టార్. అందుకే రేపు నేను ఉదయనిధి స్టాలిన్ గారి వద్దకు వెళ్లి ఇదే విషయం పై రిక్వెస్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇది బిజినెస్. ఏ స్టేట్ లోనూ దీనిని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దిల్ రాజే ఎక్కువ కనిపిస్తాడు.బహుశా నేను గ్లామర్ గా ఉంటాను కాబట్టి.. అందరికీ టార్గెట్ అవుతున్నానేమో” అంటూ చెప్పుకొచ్చాడు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus