Dilraju: బాలయ్య దర్శకుడి బాలీవుడ్‌ ప్రయాణం… త్వరలోనే ప్రారంభమట!

సౌత్‌ సినిమా టు బాలీవుడ్‌ సినిమా… ప్రస్తుతం దేశంలో ఎక్కువగా నడుస్తున్న ట్రెండ్‌ ఇదే. ఇక్కడి సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణులు అక్కడకు వెళ్లి గెలిచి చూపిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు మాత్రం ఆశించిన స్థాయిలో అక్కడ తమ ముద్ర వేయలేకపోతున్నారు. అలాంటివారిలో దిల్‌ రాజు ఒకరు. హిందీ నాట ఇతర నిర్మాతలతో కలసి రెండు సినిమాలు చేసినా సరైన ఫలితం అందుకోలేకపోయారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ ప్రయత్నం చేయబోతున్నారు.

తెలుగులో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌తో అనిల్‌ రావిపూడి తీసిన సినిమా ‘ఎఫ్‌ 2’ను ఇప్పుడు బాలీవుడ్‌కి తీసుకెళ్తున్నారు. నిజానికి ఈ సినిమా రీమేక్‌ గురించి చాలా రోజుల క్రితమే చెప్పారు. కానీ ఆ తర్వాత పెద్దగా ఎక్కడా టాక్‌ లేదు. దీంతో ఆ ఆలోచనను విరమించుకున్నారేమో అనే మాటలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’ తర్వాత దర్శకుడు అనిల్‌ రావిపూడి చేసేది ‘ఎఫ్‌ 2’ రీమేకే అంటున్నారు. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ కూడా వస్తుందట.

2019లో తెలుగులో వచ్చిన ‘ఎఫ్‌ 2’ మన దగ్గర భారీ విజయాన్నే అందుకుంది. నో నాన్‌సెన్స్‌ కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు కూడా. ఇప్పుడు అదే సినిమా కోసం బాలీవుడ్‌ హీరోలతో చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనలైజ్‌ చేస్తారట. అప్పుడే దిల్‌ రాజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు అని అంటున్నారు. అన్నట్లు ఈ సినిమా బోనీ కపూర్‌తో కలసి నిర్మిస్తారని గతంలో వార్తలొచ్చాయి. మరి ఆ కొలాబరేషన్‌ ఉంటుందో లేదో చూడాలి.

బాలీవుడ్‌లో గతంలో ఇలా ఇద్దరు హీరోలు, ఫ్యామిలీ రిలేషన్ల కాంబినేషన్‌లో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే అందులో ఈ సినిమా అంత కామెడీ, ఫన్‌ ఎలిమెంట్స్‌ ఉండవు. కాబట్టి ఈ సినిమాకు సరైన స్పందనే వస్తుందని ఆశిస్తున్నారు. తద్వారా దిల్‌ రాజుకు బాలీవుడ్‌లో సరైన సినిమా పడినట్లు అవుతుంది అనే మాట కూడా వినిపిస్తోంది. అక్టోబరు 20 తర్వాత ఈ విషయంలో క్లారిటీ రావొచ్చు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus