టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భార్య తేజస్విని వైఘా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాని మరోసారి షేక్ చేస్తోంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్, స్టైలిష్ మేకోవర్ తో ఆమె చేసే ఫోటోషూట్..లు హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ఆమె బ్లాక్ శారీలో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను .. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. అవి ఇప్పుడు గ్లామర్ ప్రియులను అలరిస్తున్నాయి.సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో ఆమె కనిపిస్తుంది. ఎక్కడా వల్గారిటీకి తావివ్వకుండా ‘హీరోయిన్ మెటీరియల్’ అనుకునేలా ఆమె ఈ ఫోటో షూట్లో పాల్గొంది.
Dil Raju wife Tejaswini
నెటిజన్లు కూడా హద్దులు దాటకుండా పద్దతిగా కామెంట్లు పెడుతున్నారు. ‘దిల్ రాజు సార్ ఈజ్ సో లక్కీ యార్’ అంటూ ‘అత్తారింటికి దారేది’ లో పవన్ కళ్యాణ్ స్టైల్లో ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 లో గుండెపోటుతో మరణించారు. దిల్ రాజు టాలీవుడ్లో పెద్ద నిర్మాత. పైగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు వంటి వారు. ఆయనకు ఒక తోడు కావాలని భావించి.. కూతురు హన్షిత రెడ్డి ఆయనకు 2వ వివాహం చేశారు.2020లో కోవిడ్ టైంలో తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు దిల్ రాజు.
వీరి ప్రేమకథ ఓ ఫ్లైట్ జర్నీ లో మొదలైనట్టు, తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు వెళ్ళినట్టు రివీల్ చేశారు. ఈ దంపతులకు 2022లో అన్వయ్ రెడ్డి జన్మించాడు.ఒకప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండేవారు తేజస్విని. ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. తన పర్సనల్ లైఫ్, వెకేషన్ ట్రిప్స్, ఫ్యామిలీ ఫంక్షన్లకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఆమె స్టైల్, ఫ్యాషన్ సెన్స్‌కు మంచి అంతా ఫిదా అవుతున్నారు అనే చెప్పాలి.