డింపుల్ హయాతి.. చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. అయితే ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘జర్రా జర్రా’ అనే ఐటెం సాంగ్ తో బాగా పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో ‘యురేకా’ వంటి సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా చేసే అవకాశాలు లభించింది. అటు తర్వాత రవితేజ నటించిన ‘ఖిలాడి’ వంటి పెద్ద సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమాలో ఈమె చేసిన గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదే ఈమెకు గోపీచంద్ ‘రామ బాణం’ లో మెయిన్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ తెచ్చిపెట్టింది.
అయితే ఆ సినిమాలు ప్లాప్ అవ్వడం.. అలాగే తన అపార్ట్‌మెంట్‌లో ఉండే ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో కారు పార్కింగ్ విషయంలో గొడవపడి కోర్టుకెక్కడం వల్ల డింపుల్ కెరీర్లో ఊహించని విధంగా గ్యాప్ వచ్చింది. 2 ఏళ్ళ పాటు ఆమెకు ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. ఆల్మోస్ట్ ఆమెను ఆడియన్స్ మర్చిపోతున్నారు అనుకుంటున్న తరుణంలో.. రవితేజ రూపంలో ఆమెకు మరో గోల్డెన్ ఛాన్స్ లభించింది.
అవును రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాలో డింపుల్ కి ఛాన్స్ లభించింది. కానీ హీరోయిన్ గా కాదు. జస్ట్ స్పెషల్ సాంగ్లో..! ఒక విధంగా అది కూడా మంచిదే. డింపుల్ మంచి డాన్సర్. హీరోయిన్ గా చేసిన సినిమాల్లో డాన్స్ నంబర్ పడలేదు. ఆ కారణంగా కూడా ఈమెకు కొంత మైనస్ అయ్యింది అని చెప్పాలి.
ఇప్పుడు రవితేజ సినిమాలో చేస్తున్న డాన్స్ నంబర్ కనుక క్లిక్ అయితే.. అలాగైనా బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. పైగా పెద్ద హీరోల సినిమాల్లో స్పెషల్ డాన్స్ నెంబర్లకు.. ఎక్కువగా ఊర్వశి రౌతేలానే తీసుకుంటున్నారు. డింపుల్ కనుక మళ్ళీ క్లిక్ అయితే.. ఆమె కూడా ఓ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.