Dimple Hayathi: ‘ఖిలాడి’ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చిన డింపుల్ హయాతి..!

2017 లో వచ్చిన ‘గల్ఫ్’ చిత్రంతో నటిగా పరిచయమైంది డింపుల్ హ‌యాతి.ఆ తర్వాత ‘యురేక’ అనే చిత్రంలో కూడా నటించింది. అయితే ‘గద్దలకొండ గణేష్’ మూవీలో చేసిన ‘జర్రా జర్రా’ అనే ఐటెం సాంగ్ తోనే ఈమె బాగా పాపులర్ అయ్యింది.ఆ పాట వల్ల తమిళ్, హిందీ సినిమాల్లో కూడా ఈమెకు అవకాశాలు వచ్చాయి. దాంతో రవితేజ నటించిన ‘ఖిలాడి’ మూవీలో కూడా ఛాన్స్ దక్కించుకుంది డింపుల్. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Click Here To Watch

ఈ క్రమంలో ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఈమె పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ఏకంగా ఒక పాట కోసం 6కేజీల బరువు తగ్గినట్టు కూడా చెప్పి షాకిచ్చింది. ఈమె మాట్లాడుతూ… “ఈ చిత్రంలో నా పాత్ర ర‌వితేజ‌ గారితో పాటు ఈక్వెల్ గా ఉంటుంది. ‘గ‌ద్దల‌కొండ‌ గణేష్’ లో ఐటం సాంగ్ చేస్తే భవిష్యత్తులో కూడా అలాంటివే చేయాల్సి వస్తుందని కొంతమంది అన్నారు.కానీ ఆ త‌ర్వాత కూడా నాకు నటిగా ప‌లు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

అయితే కొంత గేప్ తీసుకుని న‌టిగా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మంచి సినిమా కోసం వెయిట్ చేశాను.అలాంటి టైములో నాకు ‘ఖిలాడి’ అవకాశం వచ్చింది. ఇప్పటికైతే ఐటం సాంగ్ లు చేయ‌లేను. ఫ్యూచ‌ర్‌లో వ‌స్తే ఆలోచిస్తాను.’ఖిలాడి’ లో నేను మూడు సాంగ్‌లు చేశాను. లంగా ఓణితో, ఫుల్ మాస్, గ్లామ‌ర్ రోల్ సాంగ్ చేశా. నాకు డాన్స్ అంటే ఇష్టం. ‘కేచ్ మి’ సాంగ్ చేయ‌డానికి ముందు లావుగా ఉండేదాన్ని.దాంతో ద‌ర్శ‌కుడు న‌న్ను ఆ పాట కోసం 6 కేజీలు బరువు త‌గ్గ‌మ‌న్నారు.

అంత వెయిటు తగ్గిన తర్వాతే ఆ పాట చేశాను. ఇటలీలో ఆ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌ మొదలైంది. కానీ మధ్యలో అనుకోకుండా లాక్‌డౌన్ వ‌చ్చింది. షూట్ క్యాన్సిల్ అయ్యింది. రెండు నెల‌ల‌పాటు నా బాడీని మెయిన్‌టైన్ చేయ‌డానికి డైట్‌ తో పాటు వ్యాయామం కూడా చేయాల్సి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది డింపుల్ హయాతి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus