సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూడ్ వింటూనే ఉన్నాం. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి మాత్రమే కాదు.. మిగిలిన సినిమా పరిశ్రమలకి చెందిన వారు సైతం ఏదో ఒక కారణం వల్ల మరణిస్తూనే ఉన్నారు. తాజాగా సిఐడి నటుడు కన్నుమూయడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. సిఐడి అనే డబ్బింగ్ సీరియల్ కి తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
కొంతమంది ఒరిజినల్ వెర్షన్ ను కూడా ఎక్కువగా చూసిన, ఇప్పటికీ చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ సీరియల్ ద్వారా పాపులర్ అయిన నటుడు దినేష్ ఫడ్నిస్ డిసెంబర్ 4న రాత్రి మరణించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 2 న గుండెపోటుతో దినేష్ ఫడ్నిస్ వెంటిలేటర్ పై ఉంటూ వచ్చారని, పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్టు కొంతమంది చెబుతున్నారు.
కానీ ఇంకొంతమంది ఆయన (Dinesh Phadnis) వేరే సర్జరీ చేయించుకుంటున్న టైంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఇంకొంతమంది చెబుతున్నారు. మరి వీటిలో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది. ‘సర్ఫరోష్’, ‘సూపర్ 30 ‘ వంటి చిత్రాల్లో దినేష్ ఫడ్నిస్ నటించాడు. అలాగే ఓ మరాఠీ చిత్రానికి కూడా రైటర్ గా పనిచేశాడు. సోషల్ మీడియాలో కూడా ఇతను యాక్టివ్ గా ఉండేవాడు. ఇతని టాలెంట్ కి ఇంకా పెద్ద స్టార్ అవుతాడు అని చాలా మంది అనుకున్నారు కానీ అలాంటిది జరగలేదు.