టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో ఒకడైన అజయ్ భూపతి (Ajay Bhupathi) మొదటి చిత్రం ‘ఆర్.ఎక్స్.100’ తోనే టాప్ ప్లేస్ కి చేరుకున్నాడు. ఆ తర్వాత ‘మహాసముద్రం’ (Maha Samudram) చేశాడు. ఎందుకో అది పెద్దగా ఆడలేదు. టెక్నికల్ గా అది పెద్ద స్థాయిలోనే ఉన్నా.. కథాకథనాలు ప్రేక్షకులను మెప్పించలేదు. ఆ సినిమా మిగిల్చిన నష్టాల వల్ల.. తర్వాత అతనితో సినిమా చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రాలేదు. ఈ క్రమంలో ‘మంగళవారం’ (Mangalavaaram) అనే రూరల్ రస్టిక్ మూవీ చేశాడు.
Ajay Bhupathi
ఇది కూడా టెక్నికల్ గా రిచ్ గా ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రమే ఆడింది. అది కంటెంట్ లోపం అనడానికి లేదు. ఆ టైంకి వరల్డ్ కప్ మ్యాచ్ లు నడుస్తున్నాయి. అందువల్ల జనాలు థియేటర్లకు ఎక్కువ వెళ్ళలేదు. అందువల్ల బాక్సాఫీస్ వద్ద అది యావరేజ్ మూవీగానే మిగిలిపోయింది. ఏదేమైనా కంటెంట్ పరంగా చూసుకుంటే.. అజయ్ భూపతి బౌన్స్ బ్యాక్ అయినట్టే. కానీ అతని నెక్స్ట్ సినిమా ఇంకా అనౌన్స్ చేసింది లేదు.
ప్రస్తుతం అజయ్ వద్ద రెండు స్క్రిప్టులు రెడీగా ఉన్నాయట. ఒకటి ఓ మిడ్ రేంజ్ హీరోకి సెట్ అయ్యే సినిమా. కథ కూడా ఇంట్రెస్టింగ్…గానే ఉంటుందట. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు హీరోలకి చెప్పగా.. వాళ్ళు ఎక్సయిట్ అయ్యారట. కాకపోతే ఈ ప్రాజెక్టుకు రూ.60 కోట్ల బడ్జెట్ అవుతుందట. అందువల్ల కొంచెం పేరున్న నిర్మాతలు ముందుకు రావడం లేదని తెలుస్తుంది.
అందుకే ముందుగా ‘మంగళవారం 2’ తీసేద్దామని అజయ్ డిసైడ్ అయ్యాడట. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేయాలనే ఆలోచనలో అజయ్ భూపతి ఉన్నట్టు సమాచారం. ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఇందులో భాగం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.