అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) . ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)..లు వెంకటేష్ సరసన హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ (Bheems Ceciroleo) సంగీతంలో రూపొందిన పాటలు అన్ని ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా రమణ గోగుల (Ramana Gogula) పాడిన ‘గోదారి గట్టు మీద’ అనే పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ట్రైలర్ కూడా మంచి మార్కులు వేయించుకుంది. ఇది పక్కాగా సంక్రాంతి సినిమా అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రమోషన్స్ లో భాగంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ గురించి చేస్తున్న స్కిట్స్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెంకటేష్ పాత సినిమాల క్యారెక్టర్స్ తో చేసిన ఓ స్కిట్ లో హీరోయిన్లతో కూడా వెంకటేష్ గెటప్లు వేయించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దీంతో సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ‘మేము ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి వస్తాము..
మేము సినిమా చూస్తాము! కానీ నువ్వు మాత్రం ఇలాంటి స్కిట్స్ చేయకురా బాబు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇవి దర్శకుడు అనిల్ రావిపూడి వద్ద ప్రస్తావించగా.. ‘నేను అయితే వాటిని ఆపను. అది నా సినిమా ప్రమోషన్. నా సినిమా ఒకటి ఉంది అని ప్రేక్షకులకి గుర్తు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అయినా మేము చేసిన ఒక ఇంటర్వ్యూ 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సో చూసే వాళ్ళు చూస్తున్నారు కదా’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.