Anil Ravipudi: తనపై వస్తున్న ట్రోల్స్ పై ‘ఎఫ్3’ దర్శకుడు అనిల్ రావిపూడి స్ట్రాంగ్ కామెంట్స్..!

రాజమౌళి తర్వాత సక్సెస్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. నిజానికి ఈ ప్లేస్ లో కొరటాల శివ ఉంటారు అనుకుంటే ఆయన ‘ఆచార్య’ చిత్రంతో వెనుకబడ్డారు. ఈ క్రమంలో నిన్న విడుదలైన ‘ఎఫ్3’ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు భారీ వసూళ్ళను రాబడుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ కూడా ముఖ్య పాత్రలో నటించింది.

ఇదిలా ఉండగా.. ‘ఎఫ్3’ మూవీతో అనిల్ రావిపూడి డబుల్ హ్యాట్రిక్ అందుకున్నారనే చెప్పాలి. ‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇప్పుడు ‘ఎఫ్3’ వంటి సినిమాలు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. ‘ఎఫ్3’ చిత్రాన్ని తిట్టుకునే బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు. ఒక్క ‘ఎఫ్3’ నే కాదు దర్శకుడు అనిల్ రావిపూడి పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే బ్యాచ్ కూడా ఉన్నారు. వీళ్ళ గురించి అనిల్ రావిపూడి స్పందిస్తూ.. ” నన్ను తిట్టుకునే బ్యాచ్ అనుకున్నదానికంటే ఎక్కువే ఉన్నారు.

అది కూడా వాళ్ళకి ఫన్ ఇస్తుంది. దానిని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నా సినిమాల్ని ఎంజాయ్ చేసే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందే ఉన్నారు. వీళ్ళ కోసం వాళ్ళని సినిమాలు తీయకుండా ఇబ్బంది పెట్టలేను కదా. నా సినిమాలు, నా కెరీర్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు నా కెరీర్ పై క్లారిటీ ఉంది. నన్ను తిట్టుకునే వాళ్ళ గురించి అలోచించి నా బుర్ర పాడు చేసుకోను.

మిలిటరీ హోటల్ లో నాన్ వెజ్ పెడతారు, బ్రాహ్మణ హోటల్ లో వెజ్ పెడతారు. ఇది తెలిసి కూడా ఒకడు వెజ్ హోటల్ కు వెళ్లి వెజ్ తినేవాళ్ళని అలాగే వెజ్ ఐటమ్స్ ను తిడితే బాగుంటుందా.? నీకు ఇష్టం లేదు అంటే మిలిటరీ హోటల్ కు వెళ్లి నాన్ వెజ్ ఫుడ్ తినాలి.నా సినిమాలో ఏముంటుందో ప్రమోషన్స్ టైములో నేను చెబుతున్నాను. నేను బుచ్చిబాబు లా ‘ఉప్పెన’ తీయలేను.. బుచ్చిబాబు నా సినిమాల్లా తీయలేడు.

నేను సుకుమార్ గారిలా ‘పుష్ప’ తీయలేను, అంత క్రియేటివిటీ నాలో లేదు.. అలాగే ఆయన నాలా సినిమా తీయలేకపోవచ్చు. నన్ను తిట్టుకునే వాళ్ళు నా నుండీ కొత్తదనం కోరుకుంటున్నారేమో.. అలాంటి సినిమా నేను ఇప్పుడు ఇవ్వలేకపోవచ్చు, భవిష్యత్తులో ఇవ్వొచ్చు. అప్పటివరకు నన్ను తిట్టుకుంటూ ఫన్ ఫీలయ్యేవాళ్ళు ఫీలవ్వొచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus