Venkatesh: ముక్కోణం ఎంచుకున్న అనిల్‌ – వెంకీ.. ఆ 2 సినిమాలపై క్లారిటీ!

విక్టరీ వెంకటేష్ (Venkatesh) – బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుంది అని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరినీ కలిపి ఓ సినిమా చేయాలని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేశారు. F2 (F2 Movie) , F3 (F3 Movie) తర్వాత మరో సినిమా కోసం జట్టుకట్టారు అంటూ దిల్‌ రాజు ఉగాది నాడు అనౌన్స్‌ చేసేశారు. అంతేకాదు సినిమా కాన్సెప్ట్‌ కూడా చెప్పేశారు.

సినిమా గురించి సింగిల్‌గా చెప్పాలంటే ఇదొక ట్రై యాంగిలర్ క్రైమ్ ఎంటర్‌టైనర్. ఇదంటి సింపుల్‌ అన్నారు, ఇన్ని జోనర్‌లు కలిపేశారు అనుకుంటున్నారు. ఇది అనిల్‌ రావిపూడి సినిమా మరి. ఇవన్నీ కలిపే ఉంటాయి. కథ విషయానికొస్తే… హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని వైఫ్.. ఇదీ థీమ్. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కి కావాల్సిన అన్ని రకాల హిలేరియస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి అని టీమ్‌ చెబుతోంది.

ఇటీవల వరుసగా జనాల్లోకి దూసుకెళ్లే ట్యూన్స్ ఇస్తున్న భీమ్స్‌ సిసిరోలియో (Bheems Ceciroleo) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్‌ చేస్తారట. అంటే దిల్‌ రాజు గతంలో ప్రకటించినట్లుగా ‘శతమానంభవతి 2’ (Shatamanam Bhavati) సంక్రాంతికి రావడం లేదు అని చెప్పేయొచ్చు. ఇక సంక్రాంతి వార్‌లో ఇప్పటికే చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) , రవితేజ (Ravi Teja) సినిమా ఉండగా… ఇప్పుడు వెంకీ కూడా వచ్చారు. మరోవైపు ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) సంక్రాంతికి వస్తుందనే పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడింది అని చెప్పాలి.

‘సైంధవ్‌’ (Saindhav) అంటూ తన 75వ సినిమాతో ఈ ఏడాది పొంగల్‌ ఫైట్‌లోకి దిగిన వెంకీ… సరైన విజయం అందుకోలేకపోయారు. అయితే తనదైన ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌ జోనర్‌లో అనిల్‌ రావిపూడి సినిమా ఉండటంతో ఈ సారి విజయం పక్కా అని అంటున్నారు. అలాగే ఇద్దరికీ హ్యాట్రిక్‌ వస్తుంది అనే మాట కూడా వినిపిస్తోంది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు అని చెప్పొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus