రజనీకాంత్‌తో సినిమా చేసే ఛాన్స్ ఎవరికి కావాలి చెప్పండి అంటే… నేనున్నా, నేనున్నా అంటూ స్టార్ డైరక్టర్లు, కుర్ర డైరక్టర్లు, కొత్త డైరక్టర్లు రెడీ అయిపోతారు. ఆయన కూడా కొత్తవాళ్లకు ఛాన్స్‌లు ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి… ఎవరైనా రెడీ అనుకోండి. అయితే ఛాన్స్ వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోతే ఎంత బాధనిపిస్తుంది చెప్పండి. ఎవరి సంగతి ఏమో కానీ… ఓ దర్శకుడికి మాత్రం అలాంటి చాన్స్ మూడుసార్లు వచ్చి వెనక్కి వెళ్లిపోయిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పుకొచ్చారు.
కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ… ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాక పాన్ ఇండియా దర్శకుడు అయిపోయారు మరి. కెరీర్ ప్రారంభం నుంచి వరుస విజయాలు అందుకుంటున్న అట్లీ… ‘జవాన్’తో తన విన్నింగ్ స్ట్రీక్‌ను కొనసాగించారు. అయితే తన అభిమాన హీరో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో మాత్రం సినిమా చేయలేకపోతున్నాడు. దీని వెనుక కారణం ఇటీవల చెప్పుకొచ్చారు.
రజనీకాంత్ నటించిన ‘దళపతి’ చూసినప్పటి నుండి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆయనతో ‘రోబో’ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్‌గా వర్క్ చేశాను. అంతేకాదు ఇటీవల రెండు మూడు సార్లు స్టోరీ డిస్కషన్స్‌లో కూడా పాల్గొన్నానను అని చెప్పారు అట్లీ. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కథలు కార్యరూపం దాల్చలేదని అట్లీ చెప్పుకొచ్చారు. అయితే కచ్చితంగా రజినీకాంత్‌తో సినిమా చేస్తాను అని క్లారిటీ ఇచ్చేశారు.
అంతేకాదు ఆ సినిమా ‘బాషా’ రేంజ్లో ఉంటుంది అని కూడా చెప్పారు. రజనీకాంత్‌ను పీక్ రేంజ్లో చూపించాలి అనేదే తన కోరిక అని అట్లీ తెలిపారు. రజినీ తనను కన్నా అని ఆప్యాయతతో పిలుస్తారని చెప్పిన అట్లీ… తన డైరెక్షన్లో సినిమా చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమే అని రజనీకాంత్ అన్నారట. సో.. ఆ లెక్కన రజనీతో అట్లీ (Atlee) సినిమా కచ్చితంగా ఉంటుంది. అది ఎప్పుడ అనేదే చూడాలి.