Atlee: స్టార్ డైరెక్టర్ అట్లీ సక్సెస్ సీక్రెట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

డైరెక్టర్ గా తెరకెక్కించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలతో ఊహించని స్థాయిలో విజయాలను సొంతం చేసుకున్న డైరెక్టర్లలో అట్లీ ఒకరు. నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ దర్శకునికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. రాజారాణి, తెరి, మెర్సల్, బిగిల్, జవాన్ సినిమాలతో అట్లీ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా కథ, కథనం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడమే ఈ డైరెక్టర్ సీక్రెట్ అని చాలామంది భావిస్తారు.

జవాన్ సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో అట్లీకి పేరు వచ్చింది. నార్త్ ఆడియన్స్ ను సైతం ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరి కొందరు స్టార్ హీరోలు సైతం అట్లీ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో అట్లీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రానుంది. తనపై వచ్చిన కాపీ ఆరోపణల గురించి సైతం ఈ దర్శకుడు ఒకింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాల ద్వారా దగ్గరైన అట్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుండగా ఆ వార్త హాట్ టాపిక్ అవుతోంది. అయితే అట్లీ టాలీవుడ్ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా కాకుండా నిర్మాతగా ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. దర్శకునిగా సక్సెస్ అయిన అట్లీ నిర్మాతగా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.

అట్లీ తన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును నిర్మాణంపై ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. తెలుగులో ఒక సినిమాను, ఇతర భాషల్లో మూడు సినిమాలను నిర్మిస్తానని అట్లీ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుణ్ ధావన్ హీరోగా ఒక సినిమాను నిర్మిస్తున్నానని అట్లీ కామెంట్లు చేశారు. అట్లీ నిర్మాతగా కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. షారుఖ్, విజయ్ లతో మల్టీస్టారర్ తీయాలని ప్లాన్ చేస్తున్న అట్లీ ఈ ప్రాజెక్ట్ ను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళతారో చూడాల్సి ఉంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags