Atlee: మగబిడ్డకు జన్మనిచ్చిన దర్శకుడు అట్లీ భార్య కృష్ణ ప్రియ

  • January 31, 2023 / 08:04 PM IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..! స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసి.. ‘రాజా రాణి’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అట్లీ..! తన మొదటి సినిమాతో బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. మొదటి సినిమా లవ్ స్టోరీ తీసినప్పటికీ.. రెండో సినిమా నుండి తనలోని మాస్ యాంగిల్ ను బయటపెట్టాడు. దళపతి విజయ్‌తో ‘తేరి’ (పోలీసోడు) తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.ఆ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ హీరోలను కూడా ఆకర్షించాడు అట్లీ.

ఆ తర్వాత ‘మెర్సల్’ (అదిరింది), ‘బిగిల్’ (విజిల్) సినిమాలతో తమిళ్ తోనే కాకుండా తెలుగులో కూడా స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ఇప్పుడు బాలీవుడ్ బాద్‌షా ఫారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ అనే సినిమా చేస్తున్నాడు.అది పూర్తయ్యాక ఎన్టీఆర్ తో కూడా సినిమా ఉండొచ్చు. ఇదిలా ఉండగా.. అట్లీ కుమార్, కృష్ణ ప్రియను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఈ కపుల్ కలర్ గురించి ఎన్ని మీమ్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ప్రేమకు రంగు అడ్డుకాదని, అసలైన ప్రేమకు అర్థం చెప్పారంటూ ఎన్ని వార్తలొచ్చాయో కూడా..! డిసెంబర్ నెలలో అట్లీ భార్య గర్భవతి..అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు డెలివరీ అవ్వడం కూడా జరిగిందట. అట్లీ భార్య కృష్ణ ప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు అట్లీ- కృష్ణ ప్రియ. దీంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus