Chiranjeevi: చిరు బాబీ మూవీ షూటింగ్ అప్పుడే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు నాటికి ఆచార్య మూవీ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తరువాత చిరంజీవి మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ లో నటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి ఈ సినిమాతో పాటు బాబీ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో కూడా ఒకే సమయంలో నటించబోతున్నారని సమాచారం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తూనే మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహేష్ బాబు బాటలో మెగాస్టార్ కూడా నడుస్తుండటం గమనార్హం. బాబీ సొంతంగా తయారు చేసుకున్న కథలోనే చిరంజీవి నటిస్తుండగా ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.బాబీ గత సినిమా వెంకీ మామ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

చిరంజీవి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని బాబీ భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ తాను చిరంజీవిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బాబీ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు హిట్ రిజల్ట్ ను అందుకున్నా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు మాత్రం కాలేదు. మెగాస్టార్ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తే బాబీ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే అవకాశం ఉంటుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus