Bobby: ‘డాకు మహారాజ్‌’లో దుల్కర్‌ పాత్ర… ఏం జరిగిందో చెప్పిన బాబీ!

‘డాకు మహరాజ్‌’ (Daaku Maharaaj) సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చిన కొత్తల్లో, ఆ తరవాత షూటింగ్‌ మొదలైన తొలి రోజుల్లో ఎక్కువగా వినిపించిన విషయాల్లో సినిమాలో ఓ గెస్ట్‌ రోల్‌ ఉంది అని. అది కూడా అది ఎక్స్‌టెండెడ్‌ గెస్ట్‌ రోల్‌ అని టీమ్‌ నుండే లీక్‌లు వచ్చాయి. కానీ సినిమా ఇప్పుడు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వచ్చే సంక్రాంతికి విడుదల కూడా కాబోతోంది. అయితే ఇంకా ఆ ఎక్స్‌టెండెడ్‌ గెస్ట్‌ రోల్‌లో నటించింది ఎవరు అనే విషయం మాత్రం చెప్పలేదు.

Bobby

సినిమా ఇక వచ్చేస్తోంది, ఇప్పటికైనా చెబుతారా లేదా అనే ప్రశ్న ఓవైపు వస్తుంటే, ఇంతవరకు లీకు బయటకు రాకుండా ఎలా ఆపారు అనే విషయం మరోవైపు వినిపిస్తోంది. ఈ క్రమంలో సినిమా దర్శకుడు కేఎస్‌ రవీంద్ర (బాబీ) (Bobby) అసలు విషయం చెప్పుకొచ్చారు. సినిమాలో ఎలాంటి గెస్ట్‌ రోల్‌, ఎక్స్‌టెండెడ్‌ గెస్ట్‌ రోల్స్‌ లేవని చెప్పారు. దానికి కారణం ఆయన గత సినిమానే అని కూడా చెప్పారు.

ఈ ‘గెస్ట్‌’ రోల్ గురించి లీకులు వస్తున్న తొలి రోజుల్లో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) , విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) లాంటి పేర్లు వినిపించాయి. దీంతో ఆ కాంబినేషన్‌ ఊహే అద్భుతం అంటూ ఫ్యాన్స్‌ మురిసిపోయారు. మరెందుకు ఆ పాత్ర పెట్టలేదు అని అడిగితే.. మొత్తం స్క్రిప్ట్‌ రెడీ అయిన తర్వాత మరో హీరో పాత్రను కథ డిమాండ్ చేయలేదు. బలవంతంగా ఆ పాత్రను ఇరికిస్తున్నామా అనే ఫీలింగ్ వచ్చింది అని బాబీ చెప్పారు.

అలాగే మరో హీరోను సినిమాలో తీసుకుంటే, మళ్లీ ‘వాల్తేరు వీరయ్య’  (Waltair Veerayya) ఫార్మాట్ లోనే సినిమా చేశాననే ఫీలింగ్ జనాలకు వస్తుంది. అందుకే సెకెండ్ హీరో పాత్ర ఆలోచనను తీసేశాం అని క్లారిటీ ఇచ్చారు బాబి. ఇక ఈ సినిమా కోసం ఒకే కథను బాలకృష్ణకు (Nandamuri Balakrishna)  మూడు వెర్షన్లలో చెప్పామని, ఆయన ఓకే చేసిన వెర్షన్‌ను ఇప్పుడు సినిమాగా చేశామని చెప్పారు. ఈ సినిమా జనవరి 12న వచ్చాక ఈ విషయాల్లో ఫుల్‌ క్లారిటీ వస్తుంది.

భార్య సంపాదనపై బతికేటోడిని బాలీవుడ్‌కి కింగ్‌ని చేసిన సందీప్‌ వంగా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus