Balakrishna: బాలయ్య కోసం ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు వెయిటింగ్..!

  • March 9, 2022 / 01:13 PM IST

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు బాలయ్య కోసం స్టార్ డైరెక్టర్లు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ‘అఖండ’ ఎఫెక్టా? లేక స్టార్ హీరోలు ఖాళీ లేకపోవడం వల్లనా? అనేది అర్ధం కాని ప్రశ్న? ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. దాంతో పాటు కొరటాల శివ కూడా ఓ మల్టీస్టారర్ సబ్జెక్టు తో వెయిటింగ్లో ఉన్నాడు.

Click Here To Watch Now

పూరి అయితే బాలయ్య కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకుని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళ స్టేటసే పెండింగ్లో ఉంటే సంపత్ నంది కూడా బాలయ్యతో సినిమా చెయ్యడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అతని సొంత ఊర్లో బాలయ్యతో తన నెక్స్ట్ సినిమా అని చెప్పేసి వచ్చినట్టు మొన్నామధ్య వార్తలు వచ్చాయి. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో సంపత్ నంది ప్రాజెక్టు మొదలుకావాల్సి ఉంది. కాకపోతే దర్శకుడు బాబీకి కూడా ఆ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి ఎప్పుడో సైన్ చేసాడు.

అతను కూడా బాలయ్య కోసం ఓ కథ రెడీ చేసుకున్నాడట. చిరుతో సినిమా పూర్తయిన వెంటనే బాలయ్యతో సినిమా చేయడానికి అతను సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ రెండు కథలు విన్న ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు సందిగ్ధంలో పడినట్టు సమాచారం. వాళ్ళకైతే ఈ రెండు కథలు నచ్చాయి… పైగా ఇద్దరూ కూడా స్టార్ డైరెక్టర్లు. కాబట్టి బాలయ్య ముందు ఈ రెండు కథల్ని ఉంచి.. ఆయనకి ఏ కథ నచ్చితే ఆ కథతో ప్రాజెక్టుని సెట్ చెయ్యాలని వాళ్ళు భావిస్తున్నట్టు సమాచారం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus