టాలీవుడ్ ఇండస్ట్రీలో దివంగత నటుడు శ్రీహరికి (Srihari) ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా వెలుగు వెలిగిన శ్రీహరి తన జీవిత కాలంలో ఎంతోమందికి సహాయం చేశారు. ఎవరు కష్టంలో ఉన్నారని తెలిసినా సహాయం చేసే విషయంలో ఆయన ముందువరసలో ఉండేవారు. ఆర్థికంగా కూడా శ్రీహరి ఎంతోమందిని ఆదుకునేవారు. తన సహాయం కోరి వచ్చిన వాళ్ల వైపు న్యాయం ఉందంటే సహాయం చేయడానికి ఆయన వెనుకాడేవారు కాదు.
దర్శకుడు బాబీ (Bobby) ఒక సందర్భంలో శ్రీహరి గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. చాలా సంవత్సరాల క్రితం శ్రీహరికి అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని ఆ వ్యక్తితో పాటు అతని కుటుంబ సభ్యులు బస్ లో షిరిడీ నుంచి హైదరాబాద్ కు ట్రావెల్ చేస్తున్నారని వెల్లడించారు. బస్సులో కుటుంబంతో ప్రయాణిస్తున్న వ్యక్తి కుటుంబ సభ్యులపై కొంతమంది మద్యం తాగి ఇష్టానుసారం కామెంట్లు చేశారని ఆ వ్యక్తి ఫోన్ చేసి శ్రీహరికి సమస్య వివరించగా తాను చూసుకుంటానని శ్రీహరి ఫోన్ పెట్టేశారని బాబీ వెల్లడించారు.
ఉదయం 5.30 గంటలకు శ్రీహరిగారు నిద్ర కళ్లతో లుంగీ టీషర్ట్ లో ఆ వ్యక్తికి కనిపించారని శ్రీహరి అంటే అదీ అని బాబీ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు శ్రీహరి సినీ కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. శ్రీహరి చిన్న వయస్సులోనే కాలేయ సంబంధిత సమస్యలతో మృతి చెందడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది.
శ్రీహరి జీవించి ఉంటే ఆయన మరెన్నో అద్భుతమైన పాత్రలను పోషించే అవకాశాలు అయితే ఉండేవారని చెప్పవచ్చు. ఆయన భౌతికంగా మరణించినా నటించిన సినిమాల ద్వారా మాత్రం ఆయన జీవించి ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తారు. శ్రీహరి లేని లోటు ఆయన కుటుంబ సభ్యులను ఎంతగానో బాధ పెట్టింది.