ప్రభాస్ 20 వ సినిమాకి డైరక్టర్ అతనే
- March 28, 2017 / 07:18 AM ISTByFilmy Focus
ఇక నుంచి ప్రతి ఏడాది రెండు సినిమాలు తప్పకుండా చేస్తానని బాహుబలి 2 ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ అభిమానులకు మాట ఇచ్చారు. ఆ మాట తప్పకూడదని పక్కా ప్లాన్ తో ఉన్నారు. బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రం తర్వాత ప్రాజక్ట్ కూడా ప్రభాస్ ఒకే చేసినట్లు తెలిసింది. తమిళంలో ‘రాజా రాణి, తేరి’ వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న యువ డైరక్టర్ అట్లీతో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇతను విజయ్ హీరోగా ఒక సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నారు. అది పూర్తవగానే ప్రభాస్ స్క్రిప్ట్ ఫై ఫోకస్ పెట్టనున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ప్రభాస్ 20 వ చిత్రాన్ని కూడా యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లో తెలుగు, తమిళం భాషల్లో నిర్మించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















