Balakrishna, Allu Aravind: బాలకృష్ణ-అల్లు అరవింద్.. డైరెక్టర్ ఎవరంటే..?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన ‘ఆహా’ యాప్ కోసం నందమూరి బాలకృష్ణ తో ‘అన్ స్టాపబుల్’ అనే షోని హోస్ట్ చేయించారు. ఈ షోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘బింబిసార’ అనే సినిమా చేసిన మల్లిడి సత్యనారాయణ కుమారుడు మల్లిడి వశిష్ట్ కు అడ్వాన్స్ ఇచ్చారు అల్లు అరవింది. ఒక పోలీస్ అధికారి అవినీతి, రౌడీయిజాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడనేదే కథ.

అల్లు అరవింద్ కి కథ నచ్చడంతో దర్శకుడికి ఐదు లక్షల అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కథను బాలయ్యకు వినిపించి ఓకే అనిపించే ప్రయత్నాల్లో అల్లు అరవింద్ ఉన్నారని సమాచారం. ‘బింబిసార’ పార్ట్ 2 షూటింగ్ పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంది. గీతాఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రయత్నించారు అల్లు అరవింద్. కానీ కుదరలేదు. ఇప్పుడు బాలయ్యతో సినిమా అనుకుంటున్నారు.

మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో లేదో చూడాలి. మరోపక్క బాలయ్య వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. అలానే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా కనిపించనున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus