గోపిచంద్ మలినేని.. మాస్ మహారాజా రవితేజ ‘డాన్ శీను’ తో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. ‘బలుపు’, ‘క్రాక్’ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు. ‘క్రాక్’ రవికి, గోపికి సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాక పాండమిక్ టైంలో ఫస్ట్ సూపర్ హిట్‌గా నిలిచింది. వెంకటేష్‌తో ‘బాడీగార్డ్’, రామ్‌తో ‘పండగచేస్కో’, సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘విన్నర్’.. రీసెంట్‌గా బాలయ్యతో ‘వీర సింహా రెడ్డి’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ఎ.ఆర్.మురుగదాస్, మెహర్ రమేష్ వంటి పలువురు దర్శకుల దగ్గర పని చేసిన గోపిచంద్.. ‘స్టాలిన్’, ‘లక్ష్యం’, ‘విన్నర్’ సినిమాలలో తెరపై తళుక్కుమన్నారు కూడా.. ‘విన్నర్’ తర్వాత దాదాపు ఏడాదిన్నర కొన్ని స్ట్రగుల్స్ పడ్డానని.. కొంత ప్రాపర్టీ కూడా అమ్మాల్సి వచ్చిందని.. తను డైరెక్టర్ అయిన తర్వాత పూర్తి పారితోషికం ఇచ్చింది బాలయ్య నిర్మాతలేనని ఇటీవల బాలయ్య షోలో చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు గోపిచంద్..
ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఫిల్మీ ఫోకస్ ఇంటర్వూలో.. యాంకర్, గోపిచంద్‌ని ఆయన పర్సనల్ అండ్ ప్రొఫెషన్‌కి సంబంధించిన రేర్ పిక్స్‌తో సర్‌ప్రైజ్ చేశారు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నప్పటివి అలాగే దర్శకుడు అయిన తర్వాత తీసుకున్న అరుదైన ఫోటోల గురించి అడగ్గా.. ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారాయన.. ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ అయిన తర్వాత అనిల్ రావిపూడితో కలిసి.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ని ఆయన ఆఫీసులో కలిసి పది నిమిషాల పాటు స్పెండ్ చేశామని చెప్పారు.
‘క్రాక్’ తర్వాత ‘వీర సింహా రెడ్డి’ స్క్రిప్ట్ రెడీ చేసే సమయంలో ఒంగోలు దగ్గర వేటపాలెంలోని 100 ఏళ్ల పురాతన లైబ్రరీలో రీసెర్చ్ చేస్తున్న విషయాన్ని రివీల్ చేశారు. ‘క్రాక్’ తర్వాత స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ను ఆయన ఇంట్లో కలిశానని.. చాలా అప్రిషియేట్ చేశారని అన్నారు. అలాగే రవితేజతో ‘క్రాక్’ గోవాలో సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు తన ఫ్యామిలీతో, తాను డైరెక్ట్ చేసిన రవితేజ సినిమాల షూటింగ్ అప్పటి పిక్స్ గురించి, ‘క్రాక్’ తర్వాత ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్ గురించి, తనకు 8, 9 సంవత్సరాల వయసప్పుడు తల్లితో కలిసున్న ఫోటో గురించి కూడా చెప్పారు.
ఎన్టీఆర్‌తో సినిమా..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా.. గోపిచంద్ దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు. ఆ కథ ఎ.ఆర్.మురుగదాస్‌కి వినిపించడానికి చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్‌లో కలిశారు. తారక్ స్టోరీ విన్న తర్వాత ‘కథలో హెవీ యాక్షన్ ఉంది.. నీ దగ్గర నుండి ఎంటర్ టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను’ అని చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు..
మలేషియాలో మొబైల్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్..
‘బిల్లా’ సినిమాకి అసోసియేట్‌గా వర్క్ చేస్తున్న టైంలో ప్రభాస్‌తో కలిసి మలేషియాలో దాదాపు 90 రోజులు ట్రావెల్ చేశానని.. ఓరోజు షూటింగ్ టైంలో ప్రభాస్, అనుష్క కలిసి తనను స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేయడంతో.. మొబైల్ తడిచిపోగా.. బయటకు వచ్చి ఆరబెట్టానని.. సాయంత్రం ప్రభాస్ పిలిచి కొత్త ఫోన్ గిఫ్ట్ ఇచ్చి.. పాత ఫోన్ పడెయ్ డార్లింగ్ అన్నారని.. ప్రభాస్, కృష్ణంరాజు గారు వాళ్ల ఫ్యామిలీ, మర్యాదలు వేరంటూ తన అనుభవాలను షేర్ చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రశ్నకు షాక్..
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సారథి స్టూడియోస్‌లో నైట్ షూటింగ్ జరుగుతుండగా.. రవితేజతో కలిసి పవన్ కళ్యాణ్‌ని కలిశానని.. అప్పుడాయన ‘రవితేజ మీకు చుట్టాలవుతారా?’ అని అడగ్గా.. ‘లేదు సార్’ అని చెప్పానని.. తర్వాత చాలా సార్లు పవన్‌ని కలిశానని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మెమరబుల్ గిఫ్ట్..
తాను ‘స్టాలిన్’ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు తన పుట్టినరోజు నాడు చిరంజీవి ఓ వాచ్ గిఫ్ట్ ఇచ్చారని.. అది ఇప్పటికీ తన దగ్గర భద్రంగా ఉందని గుర్తు చేసుకున్నారు గోపిచంద్ మలినేని..
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?