వాలంటైన్స్ డే రోజు డైరెక్టర్ గోపిచంద్ మలినేని వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఈ ఫిబ్రవరి 14న అందరూ వాలెంటైన్స్ డే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. సెలబ్రిటీలు కూడా తమ ప్రియమైన వారికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి పోస్టులు, ఫోటోలతో సోషల్ మీడియా అంతా సందడిగా ఉంది.. ఇక వాలంటైన్స్ డే రోజునే డైరెక్టర్ గోపిచంద్ మలినేని తన వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ‘డాన్ శీను’ మూవీతో దర్శకుడిగా పరిచయమై.. రెండో సినిమాకే వెంకటేష్ లాంటి స్టార్ హీరోని (బాడీగార్డ్) డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్న గోపిచంద్..

2013 ఫిబ్రవరి 14న శ్రీ సత్యను వివాహం చేసుకున్నారు.. గోపి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పాటు ఆమె కూడా బాగా సపోర్ట్ చేసేవారట.. వీరికి సాత్విక్ అనే బాబు ఉన్నాడు.. తనను ‘క్రాక్’ సినిమాతో బాల నటుడిగా ఇంట్రడ్యూస్ చేశారు.. బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ లోనూ నటించి మెప్పించాడు సాత్విక్.. వాలంటైన్స్ డే రోజునే ఒక్కటైన గోపిచంద్ మలినేని – శ్రీ సత్య దంపతులకు.. సినీ పరిశ్రమకు చెందిన వారు, నెటిజన్లు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus