Harish Shankar, Pawan Kalyan: పవన్‌ సినిమా గురించి హైప్స్‌ పెంచేసిన హరీశ్‌ శంకర్‌.. కానీ వై!

‘గబ్బర్‌ సింగ్‌’ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ అంటూ చాలా రోజుల క్రితం ఇంకా చెప్పాలంటే ఏడాది క్రితమే అనౌన్స్‌ అయ్యింది. కానీ వివిధ కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా సినిమా వచ్చే నెల లేదా ఆ తర్వాత నెల మొదలవుతుందని వార్తలొస్తున్నాయి. మరోవైపు సినిమా ఉన్నట్లా లేనట్టా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో క్లారిటీ ప్లీజ్‌ అంటూ చాలామంది ఫ్యాన్స్‌, నెటిజన్లు పవన్‌ కల్యాణ్‌ను, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ను అడుగుతున్నారు. ‘అంటే సుందరానికి’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో దీనిపై క్లారిటీ వచ్చింది.

అంతేకాదు ఎక్స్‌పెక్టేషన్స్‌ కూడా పెంచేశారు. బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఆ కాంబో మళ్లీ కలుస్తుంది అంటే కచ్చితంగా అంచనాలు ఆకాశానికి అంటుతాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు, హీరో చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమాకు చేటు చేయకుండా ఉండేలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అతి అంచనాలు ముంచేసేవే అని గతంలో వివిధ సందర్భాల్లో మనకు తెలిసింది. ఇప్పుడు ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ విషయంలోనూ అంతే అంటున్నారు పరిశీలకులు. సినిమా కథేంటి, ఎలా ఉంటుంది, అసలు మొదలే కాకుండా సినిమా మీద అంచనాలు పెంచేయడం మంచిదేనా? ఈ మాటకు హరీశ్‌ శంకరే సమాధానం చెప్పాలి.

సినిమా మీద అంచనాలు అమాంతం పెంచేలా మాట్లాడటం చాలా ఈజీ. కానీ ఆ అంచనాలను అందుకోవడం, హిట్‌ కొట్టడం చాలా కష్టం. ఇప్పుడు దర్శకుడు హరీశ్‌ శంకర్ తొలి పని పూరి చేసేశారు. ఇక రెండో పనే చేయాలి. ‘‘సినిమా ఉంటుందో, ఉండ‌దో అని చాలామంది ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆల‌స్య‌మైనా, ప‌ది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా రాబోతోంది. ఈ సినిమాలోని పాట‌ల గురించి, మాట‌ల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు’’ అని హరీశ్‌ శంకర్‌ చెప్పారు.

ఓ మాస్‌ సినిమా పది కాలాలపాటు గుర్తుండిపోవాలి అంటే అంత సులభం కాదు. పాన్‌ ఇండియా సినిమాలకే అంత పరిస్థితి లేదు. ఇప్పుడు పవన్‌తో హరీశ్‌ శంకర్‌ తీస్తాను అంటున్న ఆ సినిమా పది కాలాలపాటు గుర్తుండిపోతే ఆనందమే. అలాకాకుండా ఇలాంటి అతి ప్రచారం ఇబ్బంది పెడితేనే పరిశ్రమకు కష్టం.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus