Harish Shankar: సినిమా అంటే ఎమోషన్ దానికి భాష లేదు!

  • May 25, 2023 / 06:18 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ చిత్ర పరిశ్రమ గురించి సెలబ్రిటీల గురించి ఎవరైనా అంటే వెంటనే రెస్పాండ్ అవుతూ వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ ఉంటారు. అయితే తాజాగా హరీష్ శంకర్ ఓ జర్నలిస్టుకి ఇలాగే సమాధానం చెప్పారని తెలుస్తుంది.

మలయాళ చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన 2018సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాని తెలుగులో బన్నీ వాసు విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి సినిమా నచ్చుతుందని తెలియజేశారు.

హరీష్ శంకర్ (Harish Shankar) మాట్లాడిన అనంతరం విలేకరి మాట్లాడుతూ ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పటివరకు ఇలాంటి చిత్రాలను తెలుగు దర్శకులు చేయలేదని నిర్మాతలు కూడా ఇలాంటి సాహసం చేయలేదని అనిపించిందా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు హరీష్ శంకర్ సమాధానం చెబుతూ.. ప్రపంచ సినిమాని మన చేతిలోకి వచ్చింది అలాంటి టెక్నాలజీలో మనం ఉన్నాము.ప్రస్తుతం వచ్చే సినిమాలు డబ్బింగ్ రీమేకా అన్న తేడాలు ఎక్కడ లేవు ఎక్కడికి వెళ్ళినా సినిమాను చూసి సంతోషించాలి. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు చేయలేరా అని అడుగుతున్నారు.

ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమాల వైపు చూస్తుంటే మీరు మాత్రమే ఇలాంటి ప్రశ్న అడగడం చాలా జాలేస్తుంది అంటూ ఈయన విలేకరికి తన స్టైల్ లో సమాధానం చెప్పారు.తెలుగు తమిళం హిందీ అనే భాషాబేదాన్ని దర్శకులు చూడరని సినిమా అంటే ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ కు భాషతో సంబంధం లేదు అని తెలియజేశారు. ఇక ఈ వీడియోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. చులకన చేసే నోరు ఉన్నప్పుడు చురకలు వేసే నోరు కూడా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus