నిన్న ‘ఈగల్’ సక్సెస్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్లో అతిధిగా వచ్చిన హరీష్ శంకర్ స్పీచ్ హైలెట్ గా మారింది. హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ఒక ట్వీట్ చూశాను. అందులో ‘ ‘ఈగల్’ సినిమాలో లవ్ స్టోరీపై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది’ ‘లవ్ స్టోరీని ఇంకాస్త బాగా తీయాల్సింది’ అంటూ రాశారు అందులో..! నాకు అర్థం కావడం లేదు. లవ్ స్టోరీ బాగా రాయడానికి, తీయడానికి.. ఈ సినిమా మేకర్స్ టైటిల్ ఏమైనా ‘ప్రేమ పావురాలు’ అని పెట్టారా? వాళ్ళు ‘ఈగల్’ అనే పెట్టారు కదా? ఆ వెబ్ సైట్ కి సంబంధించిన వాళ్ళ గురించి ఇంకో విషయం తెలిసింది.
‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ‘రొమాన్స్ వీక్’ అని రాసింది కూడా వాళ్ళేనట. నా గురించి కూడా షాడో పిక్ పెట్టి ‘4 ఏళ్ళు సినిమా లేదు కాబట్టి ప్రొడ్యూసర్ ఇంట్లో తెల్లవార్లూ మందు తాగుతూ కాకాపడుతున్నాడు’ అని రాశాడు. ఇతని అంతకు ముందు పవన్ కళ్యాణ్ తో బ్లా బస్టర్ తీశాడు’ అని రాశారు. డైరెక్ట్ గా నా ఫోటోనే పెట్టి రాసేంత ధైర్యం వాళ్ళకి లేదు.’నువ్వేమైనా నాకు పెగ్గు కలిపావా?’ నేను 2 సినిమాలు షూటింగ్ చేస్తున్నాను.
ఇంకో రెండు సినిమాలు అనౌన్స్ చేయబోతున్నాను.ఇవన్నీ నీ దగ్గరకి వచ్చి చెప్పాలా? నా రెంట్లు, ఈ.ఎం.ఐ..ల గురించి మీ ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతున్నానా? లేదు కదా? నేను డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తాను అని తెలిసినపుడే మా అమ్మ, నాన్న, బంధువులు.. చాలా మంది ట్రోలింగ్ చేశారు. ఆ ట్రోలింగ్ ముందు మీ ట్రోలింగ్ ఎంత? నేను చెబుతున్నది ఒక్కటే.. ‘సినీ పరిశ్రమ అంటే అందులో సినీ జర్నలిస్టులు కూడా భాగమే’. మన సినీ పరిశ్రమని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
కార్తీక్ ఘట్టమనేని రెండో సినిమా చేశాడు. అతను కొత్తగా ఏదో ప్రయత్నం చేశాడు. మీ వల్ల అయితే ఎంకరేజ్ చేయండి. విమర్శ వేరు ఎద్దేవా చేయడం వేరు. మీరు విమర్శించడం.. మేము సరిదిద్దుకుంటాం. కానీ సినిమాని చంపేయకండి. ‘పీపుల్ మీడియా’ వాళ్ళు వంద సినిమాలు చేయడానికి వచ్చారు. వాళ్ళు 50 సినిమాలకే ఆపేస్తే.. మనలాంటి వాళ్ళు ఎంతమంది ఆర్ధికంగా నష్టపోతారు అనేది ఆలోచించండి” అంటూ ఓ రేంజ్లో క్లాస్ పీకాడు.
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!