Nagarjuna: నాగార్జున సజెషన్స్ పట్టించుకోవడం లేదా..?

అక్కినేని నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఒకరకంగా నాగార్జునను ఈ సినిమా బాగా అప్సెట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు నాగార్జున తన రెండో కొడుకుకు అక్కినేని అఖిల్ నటిస్తోన్న ‘ఏజెంట్’ సినిమాకి కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చారు. దర్శకుడు సురేందర్ రెడ్డికి ఈ మార్పులు నచ్చకపోయినా.. చేయక తప్పలేదట.

అయితే ఇప్పుడు నాగ్ నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోవడంతో.. సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ విషయంలో నాగ్ చెప్పిన సలహాలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. తనకు ఎలా కరెక్ట్ అనిపిస్తుందో అదే విధంగా సీక్వెన్సెస్ ప్లాన్ చేసుకున్నారట సురేందర్ రెడ్డి. నాగార్జున.. అఖిల్ తండ్రే అయినప్పటికీ.. సురేందర్ రెడ్డి మాత్రం అతడి సలహాలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ‘ది ఘోస్ట్’ సినిమా హిట్ అయి ఉంటే మాత్రం పరిస్థితి వేరేగా ఉండేది.

ఎందుకంటే ఘోస్ట్ విషయంలో కూడా నాగార్జున చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఐడియాస్ వర్కవుట్ అవ్వలేదని అర్ధమవుతుంది. అందుకే సురేందర్ రెడ్డి కూడా ‘ఏజెంట్’ విషయంలో నాగ్ సలహాలు తీసుకోవడానికి రెడీగా లేరు. నిజానికి ‘ఏజెంట్’ సినిమాను ముందుగా డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ ఇప్పుడు వాయిదా పడేలా ఉంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథ అందించారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus