సుధీర్ బాబు కూడా అదరగొడతాడు : ఇంద్రగంటి మోహన్ కృష్ణ

మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ‘వి’ చిత్రం కోసం ప్రేక్షకులు గత 5నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. నాని, సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేదా థామస్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మొదటి మార్చి 25న థియేటర్స్ లో విడుదల చెయ్యాలి అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్లు తెరుచుకోలేని పరిస్ధితి ఏర్పడటంతో .. ‘వి’ చిత్రాన్ని డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న విడుదల చెయ్యబోతున్నారు. ఇక హీరోలు నాని, సుధీర్ బాబు అలాగే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా.. ‘వి’ చిత్రాన్ని ఎక్కువగా నాని సినిమా అనే అంటున్నారు. కానీ ఈ చిత్రంలో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. అతనే హీరోగా కనిపించబోతున్నాడు.నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. అలాంటప్పుడు నాని 25వ సినిమా.. కేవలం ఇది నాని సినిమా అనే ఎందుకు అంటున్నారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దానికి దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ” ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలకాబోతుంది. అది ‘అష్టా చమ్మా’ రిలీజ్ డేట్.ఆ చిత్రం రిలీజ్ అయ్యి 12ఏళ్ళవుతుంది. ‘వి’… నానికి 25వ సినిమా. పైగా దిల్ రాజు గారితో అలాగే నాతో అతనికి హ్యాట్రిక్ మూవీ. కాబట్టి అందరి ఫోకస్ నాని వైపుకే వెళ్తుంటుంది.

కానీ సుధీర్ పొటెన్షియాలిటీ ఎంతో … నేను ‘సమ్మోహనం’ టైంలో చెప్పాను. అతన్ని చాలా తక్కువగా వాడుతున్నారు… అనడానికి బెటర్ ఎగ్జాంపుల్ ఈ చిత్రం.ఈ సినిమాలో అతను నానికి ధీటుగా నటించాడు ..! నిజానికి సుధీర్ కూడా హ్యాపీనే.. నాని 25వ సినిమాలో భాగం అయినందుకు. కానీ ఇద్దరికీ ప్రాముఖ్యత ఉండే చిత్రమిది. ఇది చాలా బ్యాలన్స్డ్ స్టోరీ” అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus