PelliSandaD: మొదటిసారి బిగ్ స్క్రీన్ పై వంద సినిమాల దర్శకుడు

100 సినిమాలకు పైగాక్ డైరెక్ట్ చేసిన కె.రాఘవేంద్రరావు ఈ మధ్య కాలంలో సినిమా వేడుకలలో టాక్ షోలతో మాట్లాడుతున్నారు గాని.. ఒకప్పుడైతే కెమెరా ముందు ఉంటే కనీసం కనుసైగలు కూడా చేసేవారు కాదు. తన సినిమాల వేడుకలలో కూడా మాట్లాడేవారు కాదు. ఇక ఆ మధ్య సౌందర్య లహరి అంటూ ఆయన కెరీర్ ను ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఇక మొదటిసారి దర్శకేంద్రుడు వెండితెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు.

గతంలో ఎప్పుడు లేని విధంగా స్టైలిష్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్నారు. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న పెళ్లి సందD సినిమాను గౌరీ రొనాంకి దర్శకత్వం వహిస్తుండగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షకుడిగా వర్క్ చేస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ పెంచిన చిత్ర యూనిట్ కె.రాఘవేంద్రరావు ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. మూడు తరాల నటీనటులతో వర్క్ చేసిన ఆయన నటన వైపు ఎప్పుడు కూడా మొగ్గు చూపలేదు.

ఇక మొదటిసారి నటించడనికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినీ ప్రముఖులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ విషెస్ అందిస్తూ రాజమౌళి కూడా ఫస్ట్ లుక్ టీజర్ ను షేర్ చేసుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus