రిలీజ్ కి ముందు ట్రోల్ చేశారు.. ఇప్పుడేమో మోసేస్తున్నారు!

దర్శకుడు బాబీ (K. S. Ravindra) తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)  సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్ ట్రైలర్ ఓకే అనిపించింది కానీ.. అప్పటికే ఆలస్యమైపోయింది కాబట్టి అది ప్రమోషన్స్ కి పెద్దగా కలిసి రాలేదు. అయితే మౌత్ టాక్ తోనే ‘డాకు’ బాక్సాఫీస్ ప్రయాణం మొదలైంది. మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకోవడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

K. S. Ravindra

చెప్పుకోడానికి ఇది కూడా రొటీన్ కథే. కానీ సినిమాలో బాలకృష్ణ (Nandamuri Balakrishna)  హీరోయిజాన్ని దర్శకుడు బాబీ ఎలివేట్ చేసిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ లో బాలయ్యని చాలా స్టైలిష్ గా చూపించాడు. సెకండాఫ్ లో కూడా చాలా సెటిల్డ్ గా కనిపించాడు బాలయ్య. అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈరోజు ‘డాకు’ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో బాబీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాబీ (K. S. Ravindra) మాట్లాడుతూ.. ” ‘డాకు మహారాజ్’ కి బాలకృష్ణ గారు ఎంతో కష్టపడి పని చేశారు. అలాగే టీం అంతా నాకు చాలా సహకరించింది. రిలీజ్ కి ముందు దాదాపు 30 రోజుల పాటు.. నేను, తమన్ రోజుకు 3,4 గంటలు మాత్రమే నిద్రపోయే వాళ్ళం. ఈ రోజుల్లో ఒకడు సక్సెస్ అయ్యాడు అంటే.. మరొకడు అతని సక్సెస్ ని ఓర్చుకోలేకపోతున్నాడు.

అలాంటి రోజుల్లో మాకు ఈ సక్సెస్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఈ సినిమాలో ‘దబిడి దిబిడి’ అనే సాంగ్.. రిలీజ్ కి ముందు ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకున్నా.. సినిమా రిలీజ్ తర్వాత కొన్ని థియేటర్స్ లో రెండు సార్లు ప్లే చేయించుకుని చూస్తున్నారట” అంటూ చెప్పుకొచ్చాడు.

మోహన్ బాబు సినిమాల్లోని డైలాగులతో కొట్టుకుంటున్న విష్ణు, మనోజ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus