2010 ఫిబ్రవరి 12న అక్కినేని నాగార్జున (Nagarjuna) నటించిన ‘కేడి’ (Kedi) అనే సినిమా రిలీజ్ అయిన సంగతి చాలా తక్కువ మందికే గుర్తుండి ఉంటుంది. ఎందుకంటే అదొక పెద్ద డిజాస్టర్ మూవీ. మార్నింగ్ షోలకే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఆరోజు శివరాత్రి హాలిడే ఉన్నప్పటికీ హౌస్ ఫుల్స్ పడలేదు అంటే ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. కిరణ్ కుమార్ (Kiran Kumar) ఆ సినిమాకు దర్శకుడు. నాగార్జునకి హోమ్ బ్యానర్ వంటి ‘కామాక్షి మూవీస్’ పై డి.శివప్రసాద్ రెడ్డి (Siva Prasad Reddy) నిర్మించారు.
మమతా మోహన్ దాస్ (Mamta Mohandas) నాగ్ సరసన నటించింది. ప్రజెంట్ సెన్సేషన్ ఆఫ్ ఇండియా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ చిత్రంలో చిన్న పాత్ర పోషించడంతో పాటు.. దీనికి ఎడిగా కూడా పనిచేశాడు. బోట్ సీక్వెన్స్ లో సందీప్ రెడ్డి వంగాని మనం గమనించవచ్చు. ఈ సినిమా ఫలితం వల్ల కిరణ్ కుమార్ దాదాపు 15 ఏళ్ళ పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మొత్తానికి ఇప్పుడు ‘KJQ'(కింగ్ జాక్ క్వీన్) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈరోజు ఆ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకి కెకె గా పేరు వేసుకున్నాడు కిరణ్. ఈరోజు టీజర్ లాంచ్ లో భాగంగా అతను మీడియాతో ముచ్చటించాల్సి వచ్చింది. ఇందులో చాలా వరకు అతని ‘కేడి’ ఫలితాన్ని గుర్తు చేస్తూనే ప్రశ్నల బాణాలు వదిలారు రిపోర్టర్లు. వాటికి కిరణ్ విసిగి పోకుండానే జవాబు ఇచ్చాడు.
‘ ‘కేడి’ సినిమా స్లమ్ డాగ్ మిలీనియర్ కి దగ్గరగా ఉందని చాలా మంది అంటారు. కానీ ఆ సినిమా టైంకి ‘స్లమ్ డాగ్ మిలీనియర్’ నేను చూడలేదు. ఇక ‘కేడి’ సినిమాని నేను పాటలు లేకుండా తీయాలని అనుకున్నాను. కానీ 9 పాటలు పెట్టాల్సి వచ్చింది. దీనిని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. ‘KJQ'(కింగ్ జాక్ క్వీన్) కి అయితే సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నాకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కెకె.
KD సినిమా పాటలు లేకుండా చేద్దామనుకున్నా.. కానీ 9 పాటలు పెట్టాల్సి వచ్చింది#DheekshithShetty #ShashiOdela #YuktiThareja pic.twitter.com/VGygZwzKVE
— Filmy Focus (@FilmyFocus) April 30, 2025
25 mins ago