‘నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పని ఇక అయిపోయింది. ఇక అతను రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్. ఇంకా ఇంకా హీరోగా సినిమాలు తీసి కమెడియన్ అయిపోతున్నాడు. వేరే హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసుకోవడం బెటర్’.. ఇవి ‘మిత్రుడు’ (Mitrudu) సినిమా రిలీజ్ టైంలో బాలకృష్ణ గురించి వినిపించిన విమర్శలు. అలాంటి టైంలో ‘సింహా’ (Simha) అనే సినిమా వస్తుంది అంటే జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ‘భద్ర’ (Bhadra) ‘తులసి’ (Tulasi) వంటి 2 హిట్లు తీసిన బోయపాటి (Boyapati Srinu) 3 ఏళ్ళ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. అందువల్ల బోయపాటి కూడా ఏం చేస్తాడులే అని అంతా అనుకున్నారు.
కానీ 2010 ఏప్రిల్ 30న థియేటర్లకు వెళ్లిన బాలయ్య అభిమానులు.. ఫుల్ గా బిర్యానీ తిని బయటకు వస్తున్న జనాల మాదిరి కనిపించారు. ప్రతి చోటా ఒక్కటే మాట. ‘సింహా’ బ్లాక్ బస్టర్. ఆ తర్వాత సంగతి అందరికీ తెలిసిందే. మరి నేటితో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ‘సింహా’ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో ఒక లుక్కేద్దాం రండి :
నైజాం | 7.10 cr |
సీడెడ్ | 7.70 cr |
ఉత్తరాంధ్ర | 3.43 cr |
ఈస్ట్ | 1.69 cr |
వెస్ట్ | 1.76 cr |
గుంటూరు | 3.70 cr |
కృష్ణా | 1.99 cr |
నెల్లూరు | 1.44 cr |
ఏపీ+తెలంగాణ(టోటల్) | 28.81 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.83 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 31.64 cr |
‘సింహా’ (Simha) రూ.18.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఏకంగా రూ.31.64 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి ఆ సినిమా రూ.12.94 కోట్ల లాభాలను మిగిల్చింది. అప్పుడున్న స్టార్ హీరోలే రూ.30 కోట్లు కొట్టలేక సతమతమవుతున్న టైంలో బాలయ్య ఈజీగా రూ.30 కోట్ల షేర్ దాటేసి అందరికీ షాకిచ్చాడు. మాస్ లో అతని జోరు ఏమాత్రం తగ్గలేదు అని ఈ ఒక్క సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు.