అపజయ మెరుగని దర్శకులలో రాజమౌళి తర్వాత మనం చెప్పుకోవాల్సి వస్తే… కొరటాల శివ పేరు ముందుగా చెప్పుకోవాలి. ఈ లిస్టు లో అనిల్ రావిపూడి కూడా ప్రస్తుతానికి ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో అతను ఇంకా నమ్మకం సంపాదించాలేదు. అయితే కొరటాల శివ సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఉంది. రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో నమ్మకం సంపాదించుకుంది ఇతనే. కెరీర్ ప్రారంభంలో రైటర్ గా పనిచేసి ‘మిర్చి’ చిత్రంతో డైరెక్టర్ గా మారి.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
ఆ తరువాత ‘శ్రీమంతుడు’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు… ‘సొంత ఊరుని దత్తత తీసుకోవడం’ అనే కొత్త కాన్సెప్ట్ ను పరిచయం చేసి చాలా మంది ఆ దిశగా అడుగులు వేసేలా ప్రేరేపించాడు. ‘జనతా గ్యారేజ్’ ‘భరత్ అనే నేను’ చిత్రాలలో కూడా సామజిక అంశాల పై స్పందించడమే … కాదు ఆ హీరోల అభిమానులకి కావాల్సిన మాస్ ఎలెమెంట్స్ ను కూడా నింపి సూపర్ హిట్లు అందుకున్నాడు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న కొరటాల 5 ఏళ్లలో రిటైర్ అవుతాను అని ప్రకటించి షాక్ ఇచ్చాడు. కొత్త దర్శకులను ఎంకరేజ్ చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం తన వద్ద ఉన్న స్క్రిప్ట్ లు తెరకెక్కించాలి అంటే మరో 5 ఏళ్లు పడుతుందని ఆయన తెలిపాడు. నిర్మాత గా మారి కొత్త దర్శకులను ప్రోత్సహించ నున్నట్టు కూడా కొరటాల చెప్పుకొచ్చాడు.