‘మిర్చి’ (Mirchi) ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ (Koratala Siva) . సక్సెస్ రేటు పరంగా పారితోషికం పరంగా కూడా కొరటాల హవా బాగా నడిచింది. అంతేకాదు కొరటాల శివ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అనే అభిప్రాయం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు. అయితే ఎన్నో అంచనాల నడుమ రూపొందిన ‘ఆచార్య’ (Acharya) సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది.
హిట్స్, ప్లాప్స్ అనేవి ఏ దర్శకుడికైనా సర్వసాధారణం. కానీ ‘ఆచార్య’ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా వేలు పెట్టడంతో కొరటాల శివ చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. అప్పులు తీర్చడానికి స్థలం కూడా అమ్ముకున్నట్లు వార్తలు వినిపించాయి. ఏదేమైనా 4 సినిమాలతో తెచ్చుకున్న ఇమేజ్ మొత్తం ‘ఆచార్య’ ఫలితం వల్ల కోల్పోయినట్టు అయ్యింది. ఎన్టీఆర్.. ‘దేవర’ (Devara) చేసే ఛాన్స్ ఇచ్చినా.. అది రిలీజ్ అయ్యే వరకు కొరటాల ‘ఆచార్య’ భారాన్ని మోయాల్సిందే.
సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘ఆచార్య’ రిలీజ్ అయ్యాక కొరటాల శివ.. ఎటువంటి పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించలేదు. ‘దేవర’ ప్రైవేట్ ఓపెనింగ్ ఫంక్షన్ లో కనిపించారు అంతే..! అయితే 2 ఏళ్ల తర్వాత ఆయన ఓ పబ్లిక్ ఈవెంట్ కి రాబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. సత్యదేవ్ (Satyadev) హీరోగా తెరకెక్కిన ‘కృష్ణమ్మ’ (Krishnamma) ట్రైలర్ లాంచ్ వేడుక ఏప్రిల్ 26న జరగబోతుంది. ఈ వేడుకకి కొరటాల శివ హాజరు కాబోతున్నారు. ‘కృష్ణమ్మ’ చిత్రానికి కొరటాల నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.