Krish Jagarlamudi: ‘హరిహర వీరమల్లు’ ఒరిజినల్ కథ రివీల్ చేసిన క్రిష్

” ‘హరి హర వీరమల్లు’ నేను తీసింది అంతా వేరే కథ. నేను షూట్ చేసింది చాలా వరకు ఢిల్లీ దర్బార్ లో జరుగుతుంది. మేము అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా భారీ ఎత్తున సెట్ వేశాం. ఏ.ఎం.రత్నం గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ‘టెక్ ఇట్ గ్రాంటెడ్’ గా తీసుకునే వ్యక్తి కాదు. చాలా గొప్పగా చేద్దామని ఆలోచించే గ్రేట్ ప్రొడ్యూసర్. ఆయన విజనరీ ప్రొడ్యూసర్. ఎర్రకోటలో దర్బార్ ను తోట తరణి గారి ఆధ్వర్యంలో సెట్ వేశాం. మయూరి సింహాసనం సెట్ కూడా వేయించాం. తాజ్ మహాల్ కి ఎంత ఖర్చు చేశాడో, మయూరి సింహాసనం కోసం కూడా అంత ఖర్చు చేశాడు షాజహాన్.

Krish Jagarlamudi

ఆ సింహాసనాన్ని ఔరంగజేబు పట్టుకెళ్ళిపోయాడు. ఆగ్రాలో పట్టుకెళ్ళిపోయి అతను రాజ్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లినట్లు చూపించాం. కళ్యాణ్ గారు చాలా ఎక్స్ట్రార్డినరీ స్టంట్స్ చేశారు. కోహినూర్ దొంగిలించడం.. మయూరి సింహాసనం పై నిలబడి ఔరంగజేబుకి సవాలు విసరడం, ఔరంగజేబు కోర్టుకి ఎలా వెళ్లారు? 30 ,40 నిమిషాల మంచి ఫుటేజీ ఉంది” అంటూ ‘హరిహర వీరమల్లు’ ఒరిజినల్ కథ గురించి ‘ఘాటి’ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు దర్శకులు క్రిష్.

దురదృష్టం కొద్దీ ఇందులో ఒక్క ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన, వచ్చిన ‘హరిహర వీరమల్లు’ లో లేదు. ‘ఏ.ఎం.రత్నం చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్,ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం కాదు,ఆయన విజనరీ ప్రొడ్యూసర్’ అంటూ క్రిష్ పలికిన మాటలను బట్టి.. నిర్మాత ఏ.ఎం.రత్నంని తప్పు పట్టడానికి లేదు అని కూడా అర్థం చేసుకోవచ్చు.

కాకపోతే ‘నేను తీసిన ఫుటేజ్ ఎప్పటికైనా బయటకు వస్తుంది’ అని క్రిష్ చెప్పిన మాటలు మాత్రం కొంచెం అతిశయోక్తి అనిపించాయి. ఎందుకంటే ‘హరిహర వీరమల్లు’ పెద్ద డిజాస్టర్ అయ్యింది కాబట్టి.. సెకండ్ పార్ట్ వచ్చే అవకాశాలు లేనట్టే కదా..!

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus