ఈ ఏడాది విడుదలైన సినిమాలలో హనుమాన్ మూవీ బడ్జెట్ పరంగా మిడిల్ రేంజ్ మూవీ అయినా కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అనే చెప్పాలి. హనుమాన్ మూవీ ఈ సినిమా చూసిన అభిమానులందరికీ ఎంతగానో నచ్చేసిందే. అయితే కృష్ణవంశీ డైరెక్షన్ లో చాలా సంవత్సరాల క్రితం శ్రీ ఆంజనేయం తెరకెక్కగా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమా అప్పట్లో నష్టాలను మిగిల్చింది. అయితే కృష్ణవంశీ తాజాగా నెటిజన్లతో ట్విట్టర్ లో ముచ్చటించగా ఒక నెటిజన్ హనుమాన్,
శ్రీ ఆంజనేయం సినిమాలను పోల్చి చూస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంశీ అనే నెటిజన్ నాకెందుకో హనుమాన్ మూవీ కంటే శ్రీ ఆంజనేయం మూవీ ఎంతగానో నచ్చిందని శ్రీ ఆంజనేయం మూవీ సూపర్ మూవీ అని కామెంట్లు చేశారు. అప్పటి ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకో నచ్చలేదని నెటిజన్ అన్నారు అయితే ఆ కామెంట్ గురించి కృష్ణవంశీ స్పందిస్తూ ప్రేక్షకులు ఎప్పుడూ రాంగ్ కాదని అభిప్రాయపడ్డారు. శ్రీ ఆంజనేయం సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదంటే రీచబులిటీ సమస్య ఉందని కృష్ణవంశీ వెల్లడించారు.
అందువల్ల ప్రేక్షకులను నిందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ ఆంజనేయం సినిమాలో కొన్ని పోర్షన్లకు సంబంధించి నేను రాంగ్ అని ఆయన చెప్పుకొచ్చారు. శ్రీ ఆంజనేయం సినిమా కాన్సెప్ట్ పరంగా బాగానే ఉన్నా కథ, కథనం విషయాలలో కొన్ని పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లు జరగకుండా ఉండి ఉంటే శ్రీ ఆంజనేయం అప్పట్లోనే హనుమాన్ స్థాయి హిట్ అయ్యేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణవంశీ (Krishna Vamsi) రంగమార్తాండ సినిమాతో ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. తర్వాత సినిమాలతో కృష్ణవంశీ కెరీర్ బెస్ట్ హిట్లను అందుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. కృష్ణవంశీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా స్టార్ హీరోలు కృష్ణవంశీకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.