దర్శకులకు ఓ మార్క్ ఉంటుంది. వాళ్ల సినిమాలు చాలావరకు ఆ మార్క్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మార్క్ అంటే ఇంచుమించు జోనర్ అని చెప్పొచ్చు. జోనర్‌లను తరచుగా మార్చే దర్శకులు ఇప్పుడు బాగా తగ్గిపోయారు. అలాంటి దర్శకుల్లో లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఒకరు. ‘ఖైదీ’(Kaithi), ‘మాస్టర్’(Master) , ‘విక్రమ్’ (Vikram), ‘లియో’ చిత్రాలతో తనేంటో నిరూపించుకుని పాన్ ఇండియా దర్శకుడు అయిపోయారు. దీంతో నెక్స్ట్ సినిమాలు ఏంటి అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో రజనీకాంత్‌తో ‘కూలీ’ (Coolie) అనే సినిమా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు.
ఈ సినిమాను లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఎలా భాగం చేస్తారు అనే చర్చ మొదలైంది. అయితే ఆ సినిమాకు, సినిమాటిక్ యూనివర్స్‌కు ఎలాంటి సంబంధం లేదు అని తేల్చేశారు లోకేశ్ కనగరాజ్. రెండూ వేర్వేరు నేపథ్యాలు అని చెప్పారు. అయితే గన్స్, బ్లడ్స్ మాత్రం తన సినిమాల నుండి దూరమవ్వదు అని తేల్చేశారు. ‘కూలీ’ సినిమా గురించి లోకేశ్ (Lokesh Kanagaraj) మాట్లాడుతూ ఆరు నెలలకు మించి ఒక సినిమాకు షూటింగ్ చేయడం నచ్చదు. ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ 180 రోజుల్లోపే పూర్తి చేశాను.
‘కూలీ’ సినిమాను కూడా అలానే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పారు. అయితే ఇటీవల రజనీకాంత్‌కు సర్జరీ జరగడంతో సినిమాకు కాస్త గ్యాప్ వచ్చింది. అక్టోబర్ 16 నుండి ఆయన తిరిగి సెట్స్‌లోకి వస్తారు అని లోకేశ్ తెలిపారు. మరి కొత్త సినిమాల సంగతి ఏంటి అని అడిగితే ఐదేళ్లపాటు ఎప్పటిలానే బ్లడ్, గన్స్‌తో సినిమాలు రెడీ చేస్తున్నా అని చెప్పారు. అలాంటి కథలకు తాను ఇప్పటికే కమిట్ అయ్యానని తెలిపారు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ అంచనాలు పెరిగాయి.
దానిని పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాను ఇక ‘విక్రమ్’ సినిమాకు బ్లాక్‌బస్టర్ ఎండింగ్ కోసం ‘రోలెక్స్’ వచ్చాడు. ఆ పాత్రను పూర్తి స్థాయిలో తీసుకొని ‘రోలెక్స్’ సినిమా చేస్తా అని లోకేశ్ చెప్పారు. అదయ్యాక ఎల్‌సీయూ హీరోలందరితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా అని చెప్పారు. ఇక అవకాశం వస్తే ‘లియో 2’ కూడా చేస్తా అన్నారు. దానికి ‘పార్థిబన్’ అనే పేరు పెడతా అని చెప్పారు. కాబట్టి లోకేశ్ లైనప్ మామూలుగా లేదు.