Lokesh Kanagaraj: ఖైదీ సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్!

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. ఈ సినిమా జూన్ 3వ తేదీ వివిధ భాషలలో విడుదలయ్యే ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను రాబడుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో డైరెక్టర్ లోకేష్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వార్తల్లో పెద్ద ఎత్తున వినబడుతుంది. ఇక విక్రమ్ సినిమా ద్వారా లోకేష్ ఖైదీ సినిమా సీక్వెల్ గురించి హింట్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఖైదీ సినిమా సీక్వెల్ ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం గురించి కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు.ఇకపోతే తాజాగా డైరెక్టర్ లోకేష్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ సినిమాకి సీక్వెల్ చిత్రం ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా స్టోరీలైన్ చెబుతూ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచారు. 2019 వ సంవత్సరంలో కార్తి హీరోగా తెరకెక్కిన ఖైదీ సినిమా ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ గురించి తెలియజేస్తూ మరిన్ని అంచనాలను పెంచారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ ఖైదీ సినిమా సీక్వెల్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమాలో హీరో జీవితం ఢిల్లీ జైలు లో ఏ విధంగా గడిచిందనే కథాంశంతో తెరకెక్కిందని వెల్లడించారు. ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. జైలులో ఉన్న హీరో కబడ్డీ ఆట ఆడుతూ ఎన్నో కప్పులు వెళ్ళడమే కాకుండా మాఫియా ముఠా నుంచి పోలీసులను కాపాడే తన కూతుర్ని తీసుకువెళ్తారు.

ఇకపోతే అనంతరం హీరోతో పోలీసులకు పెద్ద అవసరం ఏర్పడుతుంది. ఈ విధంగా పోలీసులకు హీరోతో ఏర్పడిన అవసరం ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా మొత్తం నడుస్తుందని డైరెక్టర్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలో కార్తీతో పాటు సూర్య కూడా నటిస్తున్నట్లు తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus