మణిరత్నం చేసే ప్రయోగాలు… ఒక్కోసారి అందరి ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోతూ చూసేలా ఉంటాయి. తాజాగా ఆయన, మరో దర్శకుడు జయేంద్రతో కలసి చేస్తున్న ప్రయత్నం ‘నవరస’. తమిళంలో రూపొందుతున్న ఈ ఆంథాలజీ.. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈ రోజు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీని గురించి మణిరత్నం కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు, దాంతో ఆ సిరీస్‌లో ఒక్క సినిమా కూడా తన దర్శకత్వంలో లేకపోవడానికి కారణాలు కూడా చెప్పారు.
‘నవరస’ తమిళంలో రూపొందుతున్న కథా సంకలనం. జాతీయ స్థాయిలో ఈ వెబ్ సిరీస్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.దర్శకుడు జయేంద్రతో కలిసి మణిరత్నం రూపొందిస్తున్న ఈ సిరీస్ ఆగస్టు 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. శృంగారం, కరుణ, శాంతం, రౌద్రం, బీభత్సం, భయానకం, అద్భుతం, వీరం… ఇలా నవరసాలతో రూపొందుతున్న చిత్రాలు ఇవి. ఒక్కో కథ ఒక్కో భావోద్వేగం నేపథ్యంగా సాగుతుందట. సూర్య, గౌతమ్ మేనన్, సిద్ధార్థ్, అరవింద్ స్వామి ఇందులో భాగమయ్యారు.
కరోనా మహమ్మారి వల్ల చితికిపోయిన సినీ కార్మికులకి అండగా నిలిచేందుకు ఏదైనా చేయాలనే ఆలోచన నుంచే ‘నవరస’పుట్టిందట. సినీ కార్మికుల కోసం మనం ఏదైనా చేయాలని జయేంద్ర చెప్పినప్పుడు ఇలా తొమ్మిది కథలతో ఓ వెబ్‌సిరీస్ చేద్దామనుకున్నాం. కథలు ఆయా దర్శకులు సిద్ధం చేసుకున్నవే. కథల్ని విని ఎంపిక చేయడం, అవసరమైనప్పుడు తగిన సలహాలు ఇవ్వడమే మా పనిగా భావించాం. అంతేకాదు దర్శకులుగా ఇందులో మేం భాగం కాకూడదని ముందే నిర్ణయించుకున్నాం అని చెప్పారు మణిరత్నం.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!