‘ఆపరేషన్ రావణ్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – మారుతి

పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఆపరేషన్ రావణ్” సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్రముఖ దర్శకుడు మారుతి అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

లిరిసిస్ట్ ప్రణవం మాట్లాడుతూ – మా డైరెక్టర్ గారు ఈ ఫంక్షన్ లో ఏదైనా మాటల్లో కాకుండా పాటల్లో చెప్పమన్నారు. ఈ సినిమాలో నేను రాసిన పాటల్లో కొన్ని లైన్స్ మీ ముందు ప్రస్తావిస్తాను. మాటల్లో ఉన్న రీతి బ్రతుకు తీరు ఉంటుందా, చేసిది ఎవ్వరంట చేయించేది ఎవరంట..ఇలాంటి పదాలతో పాటలు రాశాను. కథలోని సారాన్నే నా పాటలు వ్యక్తీకరించాయి. “ఆపరేషన్ రావణ్” పాటల్లాగే సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైలాగ్ రైటర్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ – మనకు మంచి విషయాలు నేర్పించేవి పుస్తకాలు, స్నేహితులే. వెంకట సత్య గారు నాకు మంచి మిత్రులు. ఆయన సమాజంలో జరిగే విషయాలను కథగా మలచి సినిమా చేయాలనుకున్నారు. అలా “ఆపరేషన్ రావణ్” తెరకెక్కించారు. ఈ సినిమా చూడాలనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో తమ ప్రమోషన్ ద్వారా కలిగించారు. రక్షిత్ అట్లూరి మంచి నటుడు. ఈ సినిమాతో ఆయన నటుడిగా మరో మెట్టు ఎదిగాడని భావిస్తున్నాను. ఈ సినిమా విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా. అన్నారు.

దర్శకుడు అనిల్ మాట్లాడుతూ – తండ్రి దర్శకత్వంలో కొడుకు హీరోగా నటించడం అనేది బాలీవుడ్ లో చూశాం. మన దగ్గర పూరి గారు మాత్రమే అలా చేశారు. మా వెంకట్ సత్య గారికి ఇదొక కొత్త అనుభవం అని చెప్పొచ్చు. “ఆపరేషన్ రావణ్”లో రక్షిత్ చాలా బాగా నటించాడు. నటుడిగా మరింత పరిణితి చూపించాడు. మన ఆలోచనలే మన శత్రువులు ఎలా అయ్యాయో థియేటర్ లో చూడాలనే ఆసక్తి కలుగుతోంది. ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్. అన్నారు.

దర్శకుడు వెంకట సత్య మాట్లాడుతూ – మా “ఆపరేషన్ రావణ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా దర్శకులు మారుతి గారు రావడం సంతోషంగా ఉంది. నేను, మా రక్షిత్ మూవీ కెరీర్ లోకి రావడానికి మారుతి గారే కారణం. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ సినిమా మేకింగ్ లో నాకు తోడుగా ఉన్న మా టీమ్ అందిరికీ థ్యాంక్స్. మీ ఆలోచనలే మీ శత్రువులు, సైకో థ్రిల్లర్ అనే ట్యాగ్ లైన్స్ తో ప్రమోషన్ చేస్తున్నాం గానీ మా సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ప్రేమ సెన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ప్రేమ ఇవ్వడం అనేది ఒకరకంగా ఉంటుంది. ప్రేమ అంతా నాకే కావాలని అనుకున్నప్పుడు మరో రకంగా ఉంటుంది. ఎంత డీప్ ప్రేమ, ఎంత వయలెంట్ గా మారింది అనేది ఈ సినిమాలో తెరకెక్కించాం. మన సినిమాల మనుగడ కష్టమవుతుంది అనే పరిస్థితులకు కారణాలు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయి. ఎవరైనా పెద్దవారు ఇండస్ట్రీలో పెద్దగా బాధ్యతలు తీసుకుని మనం థియేటర్స్ లో ఇంత రేట్స్ ఎందుకు పెడుతున్నాం, పాప్ కార్న్ రేట్స్ ఇంతలా పెంచితే సినిమాకు ప్రేక్షకులు వస్తారా లేదా థియేటర్స్ ఒకవారం మూసేసి మరో వారం ఓపెన్ చేస్తున్నారు..ఇలాంటి అంశాలను ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నా. అన్నారు.

హీరో తిరువీర్ మాట్లాడుతూ – పలాస సినిమాలో నేను రక్షిత్ కలిసి నటించాం. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ గానే కొనసాగుతున్నాం. మారుతి గారు పలాస టైమ్ లో మాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా వచ్చారు. ఆయనకు థ్యాంక్స్. “ఆపరేషన్ రావణ్” సినిమాలో నేను నటించాల్సింది. ఈ కథ విన్న తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నా ఫేవరేట్ థ్రిల్లర్ మూవీస్ గుర్తొచ్చాయి. కథ చెప్పడమే కాదు అంతే బాగా తీశారు. నేను ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. అనివార్య కారణాలతో ఈ మూవీలో నటించలేకపోయాను. మీ అందరికీ నచ్చే మూవీ “ఆపరేషన్ రావణ్” అవుతుంది. తప్పకుండా చూడండి. అన్నారు.

హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ – నేను ఇండస్ట్రీలోకి రావడానికి డైరెక్టర్ మారుతి గారే కారణం. ఆయన ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉంటారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. “ఆపరేషన్ రావణ్” సినిమాను మా నాన్నగారు ఎంతో బాగా డైరెక్ట్ చేశారు. ఆయన ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అని సినిమా చూశాక ఎవరూ అనుకోరు. అంత బాగుంటుంది. నా ఫ్రెండ్ తిరువీర్. మేము కలిసి పలాసలో చేశాం. పిలవగానే ఆయన మా ఫంక్షన్ కు వచ్చారు. థ్యాంక్స్. మా సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. రాధిక గారి పర్ ఫార్మెన్స్ చూస్తే మీరు ఎంతో ఎమోషనల్ అవుతారు. మాస్క్ మ్యాన్ ఎవరో కనిపెట్టి మాకు చెబితే సిల్వర్ కాయిన్ ఇస్తామని చెప్పాం. సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. తప్పకుండా థియేటర్స్ లో “ఆపరేషన్ రావణ్” చూడండి. థ్రిల్ ఫీలవుతారు. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – “ఆపరేషన్ రావణ్” సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని వెంకట సత్య గారిని అడిగేవాడిని. ఆయన మంచి టైమ్ చూసుకుని చేయాలని అనుకుంటున్నామని అనేవారు. ఈ నెల 26న మంచి డేట్ కు రిలీజ్ కు వస్తున్నారు. నేను ఆరు నెలల కిందట ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. వాళ్ల అబ్బాయిని హీరోగా పెట్టి వెంకట సత్య గారు థ్రిల్లర్ సినిమాను రూపొందించడం మామూలు విషయం కాదు. బాలీవుడ్ లో ఇలా కొందరు ఫాదర్ సన్ సక్సెస్ అయ్యారు. తెలుగులో ఇప్పుడు రక్షిత్, వెంకట సత్య గారు చేస్తున్నారు. లండన్ బాబులు అనే మూవీతో మెల్లిగా మొదలైన రక్షిత్ జర్నీ పలాసతో పీక్స్ కు వెళ్లింది. ఆ సినిమాలో తన నటనతో మెస్మరైజ్ చేశాడు రక్షిత్. అతనిలో పట్టుదల అంకితభావం ఉన్నాయి. మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. “ఆపరేషన్ రావణ్” సినిమాతో రక్షిత్ మరింత మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ మాస్క్ మ్యాన్ ఎవరు అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు వెంకట సత్య గారు. “ఆపరేషన్ రావణ్” టీమ్ అందిరకీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

నటి శ్వేత మాట్లాడుతూ – “ఆపరేషన్ రావణ్” సినిమాలో నేను లక్ష్మీ అనే క్యారెక్టర్ చేశాను. ఇంతమంచి రోల్ నాకు ఇచ్చిన డైరెక్టర్ వెంకట సత్య గారికి థ్యాంక్స్. హీరో రక్షిత్ తో నాకు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. సినిమా చాలా బాగుంటుంది. మీరంతా మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటి శ్వేతాంజలి మాట్లాడుతూ – “ఆపరేషన్ రావణ్” సినిమాలో ఒక మంచి రోల్ ఇచ్చారు దర్శకుడు వెంకట సత్య గారు. నా రోల్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. రక్షిత్ గారి లుక్ ట్రైలర్ లో చూస్తే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మా మూవీని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

డైలాగ్ రైటర్ లక్ష్మీ లోహిత్ పూజారి మాట్లాడుతూ – “ఆపరేషన్ రావణ్” సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట సత్య గారికి థ్యాంక్స్. మా రక్షిత్ గారు నిజంగా శ్రీరాముడు. తండ్రి మాట జవదాటరు. ఈ సినిమాలో ఆయన ఆనంద్ శ్రీరామ్ అనే క్యారెక్టర్ చేశారు. మన ఆలోచనలే మన శత్రువులు అనే కాన్సెప్ట్ తో వస్తున్న మా మూవీని చూడండి మీరంతా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus