నయనతార పొగరుని బయటపెట్టిన మారుతి!

  • September 17, 2018 / 07:49 AM IST

వరుస విజయాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో క్రేజీ హీరోయిన్ గా నయనతార పేరు తెచ్చుకుంది. రోజు రోజుకి అందాన్ని పెంచుకుంటూ.. అభినయాన్ని మెరుగు పరుచుకుంటూ.. నిర్మాతలను తన ఇంటి ముందు నిలబడేలా చేస్తోంది. ఆమె నటిస్తే హిట్ అవుతుండడంతో కోరినంత ఇస్తున్నారు. బహుశా ఈ క్రేజ్ తోనే టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి నయనతార చుక్కలు చూపిస్తోంది. గతంలో వెంకటేష్ హీరోగా నటించిన బాబు బంగారం సినిమా యూనిట్ కి సహకరించక ఇబ్బంది పెట్టినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాన్ని ఎవరూ బయటికి చెప్పలేదు. ఈగోలకు దూరంగా… సినిమాలనే దైవంగా భావించే వెంకటేష్ తనని నయనతార అవమానించినా బయటికి చెప్పలేదు. నిజం నిప్పువంటిది.. అందుకే ఎక్కువకాలం ఆగలేదు. బాబు బంగారం డైరక్టర్ మారుతి ఈరోజు బయటపెట్టారు. అతను దర్శకత్వం వహించిన శైలజా రెడ్డి అల్లుడు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి కలక్షన్స్ రాబడుతోంది.

ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన మారుతి నయనతార ప్రవర్తనపై  ఫైర్ అయ్యారు. “నేను చిన్న దర్శకుడిని. నాలాంటి వాళ్లకు గౌరవం ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోని స్టార్ హీరోని గౌరవించాలా ? లేదా ? కానీ నయనతార మాత్రం ఘోరంగా ప్రవర్తించింది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటేష్ ను నయనతార కొన్ని సార్లు లెక్కచేయకపోవడంతో ఆమెతో గొడవ పెట్టుకున్నానని అన్నారు. మారుతి మాటలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఆమెను ఇకనుంచి తెలుగు సినిమాల్లో తీసుకోవద్దని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus