Maruthi, Anasuya: అనసూయ గాలి తీసేసిన మారుతి.. ఏమన్నారంటే!

నెటిజన్లు, మీడియా.. ఎవరైనా సరే అనసూయ గురించి ఏమన్నా అంటే.. అంతెత్తున లేస్తుంది అనసూయ. నా గురించి ఎవరూ కామెంట్‌ చేయకూడదు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అంటూ అన్నేసి ప్రశ్నలు వేస్తుంది. తన సంపాదన గురించి, వ్యవహార శైలి గురించి ఏమడిగినా, ఏమన్నా అదే స్థాయిలో సమాధానం ఇస్తుంది. అయితే అచ్చంగా ఇలాంటి మాటల్లో కొన్నింటిని ప్రముఖ దర్శకుడు మారుతి అడిగితే/ అంటే ఒక్క మాట కూడా అనలేదు. కావాలంటే వచ్చే వారం ‘జబర్దస్త్‌’ ప్రోమో చూడండి.

‘పక్కా కమర్షియల్‌’ సినిమా ప్రచారం కోసం హీరో గోపీంచంద్, దర్శకుడు మారుతి ‘జబర్దస్త్‌’ కార్యక్రమానికి విచ్చేశారు. కాసేపు ఉండి నవ్వుకుని వెళ్లారు. అయితే అంతకంటే ముందు మారుతి… అనసూయ మీద కొన్ని కామెంట్లు చేశారు. ‘పక్కా కమర్షియల్‌ యాంకర్‌ను చూడటానికి ఇక్కడికి వచ్చాం’ అంటూ మొదలుపెట్టిన మారుతి… ఆ తర్వాత ఈవిడ చిన్న చిన్న పాత్రలు చేయమంటే చేయదు, పక్కా కమర్షియల్‌ అంటూ కొనసాగించారు. దీంతో ఆయనను మాట్లాడొద్దంటూ ఆనసూయ ఆపేసింది.

మారుతి మాటలు సరదాకు అన్నవో, లేక స్క్రిప్ట్‌ ప్రకారం అన్నవో అయితే ఫర్వాలేదు. అలా కాకుండా ఆయన చెప్పినట్లుగా పక్కా కమర్షియల్‌గా ఆలోచించి అనసూయ కొన్ని పాత్రలు చేయను అంటోందా? అనేది ఇక్కడ ప్రశ్నగా మిగిలింది. అలా అని అనసూయ చిన్న చిన్న పాత్రలు చేయడం లేదా అంటే కొన్ని సినిమాల్లో చేసింది. అయితే ఇటీవల కాలంలో మాత్రం కాస్త పేరొస్తుంది అంటేనే పాత్రలు చేయడానికి ముందుకొస్తోంది.

ఆ లెక్కన మారుతి ఓ సినిమాకు ఆమెకు ఛాన్స్‌ ఇచ్చారని, అయితే ఆ సినిమాలో పాత్ర చిన్నగా ఉండటంతో అనసూయ నటించలేదు అని అనుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. ఆయన అడగడం, ఈమె నో చెప్పడంలో తప్పే లేదు. ఒకవేళ ఇదే మాట బయట ఎవరన్నా అంటే, సోషల్‌ మీడియాలో అంటే అనసూయ ఇంతే కూల్‌గా తీసుకుంటుందా అనేదే ఇక్కడ ప్రశ్న. చూద్దాం త్వరలో మారుతి దర్శకత్వంలో అనసూయ నటిస్తుందేమో.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus