టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో ఒకరైన నాగ్ అశ్విన్ (Nag Ashwin) కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కల్కి (Kalki 2898 AD) సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో నాగ్ అశ్విన్ పేరు మారుమ్రోగింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో, క్రేజీ సీన్లతో, వావ్ అనిపించే క్లైమాక్స్ తో కల్కి సినిమాను తెరకెక్కించి నాగ్ అశ్విన్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమా రికార్డ్స్ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి.
Nag Ashwin
తాజాగా నాగ్ అశ్విన్ చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. ఒక స్కూల్ కోసం ఏకంగా 66 లక్షల రూపాయల సహాయం చేయడం ద్వారా నాగ్ అశ్విన్ వార్తల్లో నిలిచారు. నాగ్ అశ్విన్ నాగర్ కర్నూల్ జిల్లాలోని ఐతోల్ లో తన తాతయ్య సింగిరెడ్డి పర్వత్ రెడ్డి పేరుపై ఉన్న గవర్నమెంట్ స్కూల్ కు అదనపు గదులను నిర్మించి ఇవ్వడం గమనార్హం. ఈ స్కూల్ తన తండ్రి చదువుకున్న స్కూల్ అని నాగ్ అశ్విన్ అన్నారు.
ఐతోల్ తన సొంతూరు కాగా స్కూల్ అదనపు గదులకు సంబంధించి 66 లక్షల రూపాయలు ఖర్చు అయిందని సమాచారం అందుతోంది. భవిష్యత్తులో సైతం తమ కుటుంబం సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటుందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. స్కూల్ లోని అదనపు గదుల ప్రారంభోత్సవానికి పేరెంట్స్ తో కలిసి నాగ్ అశ్విన్ హాజరు కావడం జరిగింది.
నాగ్ అశ్విన్ భవిష్యత్తు సినిమాలు సైతం సొంత బ్యానర్ లో తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. కల్కి సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నాగ్ అశ్విన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లను ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి. కెరీర్ ను ఈ దర్శకుడు అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగ్ అశ్విన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.