కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా విజువల్ వండర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు తీయడం సాధారణ విషయం కాదని నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించినా సినిమాను హిట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. రాజమౌళి (Rajamouli) భవిష్యత్తులో మహాభారతం తీయాలని కలలు కంటున్నారు. అయితే ఒక్కో సినిమాకు జక్కన్న ఐదేళ్ల సమయం కేటాయిస్తున్నారు.
ఒకవేళ మహా భారతం తెరకెక్కించే విషయంలో రాజమౌళి ఫెయిలైతే నాగ్ అశ్విన్ ఆ కలను నిజం చేస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి తర్వాత అలాంటి సినిమాలు చేయడం నాగ్ అశ్విన్ కే సాధ్యమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగ్ అశ్విన్ మనిషి సింపుల్ గా కనిపించినా తన సినిమాలతో మాత్రం అద్భుతాలు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నాగ్ అశ్విన్ అంచెలంచెలుగా ఎదిగి తన కలలను నిజం చేసుకోవడంతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు. రెబల్ స్టార్ మరోసారి ఈ సినిమాతో అదరగొట్టారనే చెప్పాలి. సినిమాలో వృథా అనిపించే పాత్ర ఒక్కటి కూడా లేదని చెప్పవచ్చు. ప్రభాస్, అమితాబ్ (Amitabh Bachchan) పాత్రల మధ్య ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి.
విదేశీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తుండటం గమనార్హం. నాగ్ అశ్విన్ వల్ల వైజయంతీ మూవీస్ బ్యానర్ కు పూర్వ వైభవం వచ్చిందని చెప్పవచ్చు. కల్కి మూవీ డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతమయ్యాయి. ఒకింత ఆలస్యంగానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని భోగట్టా.