Nani: పదముదేళ్ల క్రితం సినిమాకి సీక్వెల్ ప్రకటించిన నిర్మాత!

కొన్ని క్యారెక్టర్స్ హీరోలకి ఎనలేని ఖ్యాతి గడించి పెడతాయి. విజయ్ దేవరకొండకి (Vijay Devarakonda) అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఎంతటి ఇమేజ్ ను తీసుకొచ్చిందో, నానికి (Nani) “పిల్ల జమీందార్” (Pilla Zamindar) కూడా అదే స్థాయి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలోని కామెడీ సీన్స్ కి, నాని క్యారెక్టరైజేషన్ & యాక్టింగ్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నాని కూడా పలుమార్లు తన ఫేవరెట్ సినిమా ఏంటి? అని అడిగితే “పిల్ల జమీందార్” అని నిర్మొహమాటంగా చెప్పేవాడు.

Nani

అటువంటి మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న “పిల్ల జమీందార్” సినిమాకి సీక్వెల్ రాబోతోందని నిర్మాత డి.ఎస్.రావు ప్రకటించారు. ఓ చిన్న సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరైన డి.ఎస్.రావు అక్కడ మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అయితే.. ప్రస్తుతం నాని రెమ్యునరేషన్ ఇంచుమించు పాతిక కోట్లు, ఇప్పుడు డి.ఎస్.రావు ఉన్న పరిస్థితికి అంత బడ్జెట్ పెట్టగల సత్తా ఉందా, దర్శకుడు అశోక్ (G. Ashok) సినిమాను టేకప్ చేసే పరిస్థితి ఉందా?

అసలు నాని ఇప్పుడు ఉన్న లైనప్ కి ఈ సీక్వెల్ అసలు సెట్స్ కి వెళ్లే అవకాశం ఉందా? వంటి బోలెడు ప్రశ్నలు తలెత్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా.. అసలు నానికి ఈ సీక్వెల్ గురించి తెలుసా? ఆయనకి విషయం చెప్పారా? అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇకపోతే.. నాని ప్రస్తుతం హిట్ 3 & శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రెండో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు విడుదలయ్యాక నాని రేంజ్ మారిపోవడం ఖాయం. మరి ఇంత హడావుడిలో నాని “పిల్ల జమీందార్” సీక్వెల్ ను పట్టించుకోవడం కష్టమే.

చై- శోభిత..ల పెళ్లి ప్లేస్ ఫిక్స్ అయ్యిందా..?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus