Prabhas: ప్రభాస్ మూవీ నుంచి ఆ దర్శకుడు తప్పుకున్నారా..?

స్టార్ హీరో ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చాలా సమయం కావాలని ఈ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నామని నాగ్ అశ్విన్ కొన్నిరోజుల క్రితం వెల్లడించారు.

అయితే ఈ సినిమాకు నాగ్ అశ్విన్ డైరెక్టర్ కాగా సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ సినిమా కోసం పని చేస్తూ వచ్చారు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా నుంచి తప్పుకున్నారని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఈ డైరెక్టర్ ప్రభాస్ సినిమాకు దూరం కావాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే సింగీతం శ్రీనివాసరావు తప్పుకున్నట్టు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సలార్ సినిమాను వేగంగా పూర్తి చేసి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ప్రభాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

సింగీతం శ్రీనివాసరావు బాలకృష్ణతో ఆదిత్య 369 సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు పని చేస్తే ఆ సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఆయన తప్పుకున్నాడని వస్తున్న వార్తల వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మహానటి సినిమా తరువాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus